Link copied!
Sign in / Sign up
18
Shares

మీ పిల్లలకు ఈ జాగ్రత్తలు తీసుకోండి : బెంగుళూరులో నిన్న 2 ఏళ్ళ పిల్లాడి ప్రాణాలు తీసిన బెలూన్స్ (బుడగలు)..

పిల్లలకు కొన్ని వస్తువులు ఎంతో ఆకర్షణగా కనిపిస్తూ ఉంటాయి, వాటిని వెంటనే కావాలని కోరుకోవడం చేస్తుంటారు. అ టువంటి వస్తువులలో బెలూన్స్ (బుడగలు) ఒకటి. నిన్న బెంగుళూరులోని హులిమవుకు దగ్గరలోగల చిక్కకమ్మనహళ్లిలో రెండేళ్ల పిల్లాడు బుడగలతో ఆడుకుంటూ ప్రాణాలు వదిలాడు. అసలేం జరిగిందో తెలియక ఈ పిల్లాడిని ఆమె తల్లి హాస్పిటల్ కు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది.

ఇంటి బయట ఆడుకుంటుండగా..

చిక్కకమ్మనహళ్లిలో పెయింటర్ గా పనిచేస్తున్న అబుబకర్ సిద్ధిక్ మరియు రేష్మల నాలుగవ కుమారుడు నవాజ్ సిద్ధిక్. నిన్న సోమవారం పక్కనే ఆడుకుంటున్న పిల్లలతో కలిసి ఆడుకోవడానికి ఉదయం 7.30లకు బయటకు వెళ్లి మళ్ళీ 9.30 లకు ఇంటికి వచ్చాడు. కొద్దిసేపు తర్వాత ఊపిరి ఆడకవడంతో బిడ్డను చూసి వెంటనే పక్కనే ఉన్న క్లినిక్ కు తీసుకెళ్ళింది తల్లి రేష్మ. ఇక్కడి నుండి వెంటనే పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్లండి, చాలా అపాయమని డాక్టర్ చెప్పాడు. 5 కిమీ బన్నేరుఘట్ట అపోలో హాస్పిటల్ కు ఇద్దరు డాక్టర్లతో కలిసి 11.40లకు చేరుకున్నారు.

లంగ్స్ లో ఇరుక్కుపోయిన బెలూన్

అబ్బాయి పరిస్థితిని చూసి డాక్టర్లు చాలా ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకుని వెంటనే స్పరపేటిక అంతర్దర్శక నిపుణులు స్కాం చేయడం మొదలుపెట్టారు. గొంతులో చిక్కుకున్న చిన్న బెలూన్ ముక్కను బయటకు తీశారు. మీరు పిల్లాడికి ఏం ఆహారం ఇచ్చారు అని డాక్టర్ అడగగా నిప్పట్టు తిన్నాడని చెప్పాడు. కానీ లోపల పిల్లాడి చేతులు, ముఖం, కాళ్ళు అన్ని బ్లూ కలర్ లోకి మారిపోవడం జరిగింది. లంగ్స్ లోకి బెలూన్ చేరడంతో ఇదంగా జరిగింది. ఇంటి దగ్గర ఆడుకుంటున్నప్పుడు ఒక పిల్లాడు ఇచ్చిన బెలూన్ ను ఊది ఆడుకునేటప్పుడు పగిలిపోయి నోట్లోకి వెళ్ళిపోయి లంగ్స్ లోకి చేరింది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

బెలూన్స్ నిజంగా పిల్లలకు చాలా ప్రమాదకరం, వాటిలో ఉండే రసాయనాలు కూడా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కడుపు లోపల ఇరుక్కుపోవడం వలన ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. సో, మీరు పక్కన ఉన్నప్పుడు వాళ్ళు బెలూన్స్ ఊదితే పర్లేదు గానీ వారు ఒంటరిగా ఉన్నప్పుడు అస్సలు వారికి ఇవ్వకండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon