Link copied!
Sign in / Sign up
25
Shares

‘సున్నుండలు’ తియ్యగా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి.

సున్నండలు.. ఈ పేరు వింటుంటూనే నోరు ఊరుతోంది కదూ. పోషక విలువలు అధికంగా ఉండే సున్నుండలు తయారు చేసుకోవడం చాలా సులభం. మరి వీటిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, వీటి తయారీ విధానం గురించి వివరంగా తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

బియ్యం లేదా గోధుమలు -  అర కప్పు

మినపప్పు -  3 కప్పులు

జీడిపప్పు - 10

నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు

చక్కర లేదా బెల్లం - 2 కప్పులు

తయారీ విధానం :

1.మినపప్పు మరియు బియ్యం లేదా గోధుమలను బాణలిలో బాగా వేయించి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం  లేదు.

2.జీడిపప్పు నెయ్యిలో కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి.

3.బెల్లం లేదా చక్కరను కాస్త మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న మినపప్పు, బియ్యం పిండిలో కలుపుకోవాలి.

4.చివరిగా పాన్ లో నెయ్యి వేసి పై మిశ్రమాన్ని పాన్ లో వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే జీడిపప్పును మిక్స్ చేసుకోవాలి.

5.నెయ్యిలో వేసి మిక్స్ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే సున్నుండలు రెడీ అయినట్లే.

నోరూరించే ఈ సున్నుండలను మీ ఇంటిల్లిపాదికీ పంచండి. ఇది మీకు నచ్చితే వెంటనే SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon