Link copied!
Sign in / Sign up
19
Shares

స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి సులభమైన మరియు అద్భుతమైన 3 మార్గాలు

స్ట్రెచ్ మర్క్స్ అనేది ప్రసవం తరువాత ప్రతి మహిళా ఎదుర్కునే సమస్య. పొట్ట భాగంలో, తొడల మీద ఇలా చాలా సున్నితమైన ప్రదేశాలలో వచ్చి మన అందాన్ని తగ్గిస్తాయి. వాటిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ప్రయత్నించింతాము కానీ ఉపయోగం ఉండదు. అందుకే మీకోసం తప్పకుండ ఉపయోగపడే 3 అద్భుతమైన చిట్కాలు.

1. చక్కర స్కర్బ్ 

సహజంగా చర్మపు చారలు తగ్గించే పదార్థాలలో చక్కర కూడా ఒకటి. చక్కరని ఆల్మండ్ ఆయిల్తో కలిపి వాడితే ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ఇప్పుడు ఎలా వాడలో తెలుసుకుందాము.

ముందుగా చక్కరని తీసుకొని, అందులో కాసింత ఆల్మండ్ ఆయిల్ మరియు రెండు చుక్కలు నిమ్మరసవేసి బాగా  కలపాలి.చక్కర పూర్తిగా కరిగాక స్ట్రెచ్ మార్క్స్ మీద పూయాలి. సున్నితంగా ఆ భాగాన్ని కాసేపు మర్దనా చేయాలి. కాసేపటి తరువాత ఆ ప్రదేశాన్ని కడగడం కాని స్నానం చేయడం కాని చేయాలి. ఇలా రోజు ఒక నెల పాటు చేస్తే చర్మపు చారలు దాదాపుగా కనిపించకుండా పోతాయి.

2. బంగాళ దుంప రసం

బంగాల దుంపలలో విటమిన్ C, పొటాషియం, రైబోఫ్లావిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు చర్మ కణాలను వేగంగా ఉత్తేజ పరుస్తాయి. కాబట్టి ఇవి చర్మానికి మంచిది.బంగాల దుమ్పని మంద పాటి ముక్కలుగా కోయండి. ఒక ముక్కను తీసుకొని చారల మీద రుద్దండి. తడి ఆరే వరకు ఉండి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

3. అలో వీర జెల్ 

చర్మ సమస్యలను నిర్మూలించడంలో మరియు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో అలో వీర కంటే గొప్పది లేదు అనడంలో అతిశయోక్తి కాదు. వీటి లోని సహజ గుణాలు స్ట్రెచ్ మార్క్స్ ని కూడా పూర్తిగా నిర్మూలించగలవు.

సహజంగా దొరికే అలో వీర గుజ్జు కాని మార్కెట్ లో దొరికే అలో వీర జెల్ ని కాని చారల మీద పూసి మృదువుగా మర్దన చేయండి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. లేదా, పావు కప్పు అలో వీర జెల్ లో విటమిన్ E క్యాప్సూల్స్, విటమిన్ A క్యాప్సూల్స్ లోని నునే వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చరలకు పూసి ఆరే అంత వరకు వేచి ఉండాలి. కాసేపటి తరువాత స్నానం చేయాలి. ఇలా రోజు ఒక నెల పాటు చేయాలి.

గమనిక: విటమిన్ A మరియు విటమిన్ E క్యాప్సూల్స్ అన్ని మెడికల్ షాప్స్ లో లభిస్తాయి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon