Link copied!
Sign in / Sign up
23
Shares

స్ట్రెచ్ మార్క్స్ మీద ప్రభావం చూపించే ప్రధానమైన 6 కారణాలు

 


 మహిళల చర్మం విషయంలో అతి పెద్ద సమస్య స్ట్రెచ్ మార్క్స్. ముఖ్యంగా ప్రేగ్నేన్సి అప్పుడు బెల్లి కారణంగా, ప్రసవించిన తర్వాత చర్మం సాగటం వలన  స్ట్రెచ్ మార్క్స్ కనబడుతాయి. బాడీలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడానికి చాల రకాల కారణాలున్నాయి. సమస్యల్లా వాటిని పోగొట్టుకోవడం ఎలా?  కానీ అంతకన్నా ముందు మనం రోజు చేసే పనులు స్ట్రెచ్ మర్క్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోండి.

1. నీరు త్రాగడం

రోజు సరిపడా నీరు తీసుకోకపోవడం చాలా అనారోగ్య సమస్యలకు కారణం. అలాగే స్ట్రెచ్ మార్క్స్ కి కూడా. శరీరాన్ని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. లేకపోతే శరీరం లో కొల్లాజెన్(collagen) ఉత్పత్తి తగ్గిపోతుంది. కొల్లాజెన్ మన శరీరం లో ఎక్కువగా లభించే పోషకం. ఇది చర్మాన్ని బలంగా చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలిగిస్తుంది. చర్మానికి సాగె గుణాన్ని ఇస్తుంది. నీరు తీసుకోవడం తగ్గించినప్పుడు, కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి, స్ట్రెచ్ మార్క్స్ ను అధికం చేస్తాయి. రోజుకి కనీసం 2లీటర్ల నీరు తాగితే మంచిది.

2.బరువు పెరగడం

ప్రేగ్నేన్సి అప్పుడు విపరీతంగా బరువు పెరుగుతాం. అధిక బరువు చర్మం లోని ,రక్త నాళాలను, ఎలాస్టిక్ ఫైబర్ దెబ్బతిస్తుంది. ఫలితంగా చర్మం సాగి స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.

3.బరువు తగ్గడం

ప్రసవం తరువాత అదిగకంగా పేరుకుపోయిన కొవ్వు వల్ల లావు అవ్వడం అందరికి సహజం. కానీ కొంతమంది త్వరగా లావు తగ్గడానికి విపరీతమైన వ్యాయామం చేస్తారు. అలా చేయడం స్ట్రెచ్ మార్క్స్ కు కారణం అవుతుంది. శరీరం బిగువవ్వడానికి కొంత సమయం ఇవ్వాలి. తొందరగా బరువు తగ్గడం హార్మోన్ల సింథసిస్ చేసి కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిస్తాయి.

4.క్రీమ్స్

స్ట్రెచ్ మార్క్స్ తొలిగించడానికి చాలా రకాల క్రీమ్స్ వాడుతువుంటాం. నిజానికి క్రీమ్స్ మంచి ఫలితాలనే ఇస్తాయి. ముఖ్యంగా ట్రేటినోయిన్ (tretinoin) క్రీం చాలా త్వరగా స్ట్రెచ్ మార్క్స్ ను తొలిగిస్తుంది.

5. వాటిని గోకద్దు

స్ట్రెచ్ మార్క్స్ వున్న ప్రాంతం చుట్టు చాలా జిలగా ఉంటుంది. కొంత మంది తొందరపడి గోకేస్తారు. అలా చేయడం స్ట్రెచ్ మార్క్స్ ను ఇంకా పెంచుతాయి. స్ట్రెచ్ మర్క్స్ వున్న ప్రాతం లో మొయిస్ట్ రైసర్ వాడడం ఉపయోగంగా  ఉంటుంది.

6. మరీ వేడి నీరు వద్దు

మనం రోజు ఏ నీరుతో స్నానం చేస్తున్నాం అన్నది కూడా స్ట్రెచ్ మార్క్స్ మీద ప్రభావం చూపిస్తుంది. మరీ వేడిగా వుండే నీరు వాడడం వలన శరీరం తేమను కోల్పోతుంది. డీహైడ్రేటడ్  చర్మం సాగిపోయి స్ట్రెచ్ మార్క్స్ కు కారణమవుతుంది. చల్లని నీరు తో స్నానం చేస్తే చర్మం బిగువుగా ఉండి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా వుండే అవకాసం వుంది.

కొన్ని సార్లు మీరు ఏమి చేసిన స్ట్రెచ్ మర్క్స్ అలానే ఉంటాయి. త్వరగా పోవాలనే హడావుడితో ఏదోటి చేసి ఇబ్బంది పడద్దు. మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అవి పోడానికి కొంత కాలం పడుతుంది ఓపికతో ఉండండి.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon