Link copied!
Sign in / Sign up
10
Shares

జుట్టు రాలుతుందని బాధపడకండి. ఈ చిట్కాలు రెండు సార్లు పాటిస్తే చాలు...

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ప్రధాన సమస్య హెయిర్ ఫాల్ (జుట్టు రాలడం). జుట్టు రాలకుండా ఉండేందుకు  ఏం చేయాలని ప్రతి రోజూ కొన్ని లక్షల మంది ఇంటర్నెట్ లో సర్చ్ చేయడం, కొన్ని రకాల ఆయిల్స్, ట్రీట్ మెంట్ తీసుకోవడం జరుగుతోంది. అయితే ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ టిప్స్ పాటించడం వలన ఇక ముందైనా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. ఇది చదివిన తర్వాత అందరికీ దయచేసి SHARE చేయండి.

జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి - నెమ్మదిగా ఒకే విధంగా దువ్వాలి

తలస్నానం చేసినప్పుడు లేదా జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో బలవంతంగా దువ్వడం, టవల్ లో గట్టిగా తలను తుడవడం, అలాగే మహిళలు కిందకు జారుతున్న వెంట్రుకలను ముడి వేయడం చేయకూడదు. బాగా ఆరనివ్వాలి. ఇక వెంట్రుకలు చిక్కుపడినప్పుడు బలవంతంగా దువ్వకుండా ముందు చేతులతో మసాజ్ లా చేసుకుని దువ్వడం చేయాలి.

జుట్టు చివరలు కత్తిరించడం చేయాలి

మహిళలు మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి, మగవారు నెలకు ఒకసారి జుట్టు చివరలను ఎప్పటికప్పుడు కత్తరించడం లేదా ట్రిమ్ చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది.

పోనీ టైల్ వద్దు, రబ్బర్ తో గట్టిగా ముడివేయడం

ప్రస్తుతం చాలామంది పోనీ టైల్ హెయిర్ స్టైల్ అంటూ జుట్టు చివర్లను గట్టిగా ముడివేయడం, లే దా ఏది పడితే ఆ రబ్బర్ లను టైట్ గా కట్టి వేయడం జుట్టు కట్ అవ్వడం జరుగుతుంది. ఐతే ఫ్యాబ్రిక్ రబ్బర్ లను వాడటం వలన జుట్టు ఊడిపోదు మరియు జుట్టుకు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించదు.

జుట్టు రాలకుండా ఈ ఆహారాన్ని తినండి

జుట్టు రాలడానికి కారణాలలో మీరు సరిగ్గా పాటించని డైట్, ఐరన్ మరియు ప్రోటీన్స్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం. అందుకే జుట్టు రాలకుండా ఉండేందుకు మాంసం, గుడ్లు, చేపలు, నట్స్, బీన్స్, విత్తనాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఐరన్ అధికంగా ఉండే బచ్చలి కూర, తృణ ధాన్యాలు, కాయ ధాన్యాలు, పచ్చని ఆకు కూరలు, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి.

సూర్యుడి వేడి తగలకుండా

కొన్ని నిముషాల పాటు ఎండలో తిరిగినంత మాత్రాన తల జుట్టుకు ఏమీ కాదు కానీ, ఎక్కువశాతం ఎండలో తిరిగేవారికి జుట్టు రాలే సమస్య ఉంటుంది. సూర్యుడి నుండి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల కారణంగా జుట్టు బలహీనపడుతుంది. అందుకే గొడుగు లేదా టోపీలు ఉపయోగించాలి.

సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి

ఆఫీస్ లో వర్క్ పూర్తి కాకపోతే బాస్ తిట్టాడని టెన్షన్ పడటం, ఇంటి పనులతో సతమవుతూ ఒత్తిడి, ఆందోళనకు లోనవ్వడం, ఇలా ప్రతి విషయానికి టెన్షన్ పడటం వలన అది మీ జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడి పడకుండా హ్యాపీగా ఉండండి. అలాగే మంచి నిద్ర కూడా అవసరం.

ఈ క్రీములు అస్సలు రాయకండి

జుట్టు రాలడం అందరినీ బాధించే విషయమే..మీకు నాకు అందరికీ ఉండే సమస్యే. ఐతే ఎవరో చెప్పారని ఫలానా ఆయిల్ వాడటం, ఇక్కడి చికిత్స బాగోలేదని ఇంకో చోటికి, అక్కడి నుండి మరో చోటికి, వేరే చికిత్సలు చేయించడం తలకు, జుట్టుకు మంచిది కాదు. వీలయితే మొదటిసారే హెయిర్ స్పెషలిస్ట్ ను కలిసి సలహాలు తీసుకోండి కానీ ఇతర ఏ క్రీములు వాడకండి.

లోషన్స్ వాడకుండా స్టైల్ గా ఉంచుకోవాలి

చాలామంది తలస్నానం చేసిన వెంటనే ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు హెయిర్ స్టైల్ గా ఉండాలని కొన్ని రకాల ఆయిల్స్ మరియు లోషన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ప్లీజ్ ఇక ఎప్పుడు అలా చేయకండి. వాటివలనే ఎక్కువ జుట్టు రాలుతుంది. లోషన్స్, ఆయిల్స్ వాడకుండా ఎలా స్టైల్ గా హెయిర్ ఉంచుకోవాలో చూసుకోండి.

మీ జుట్టు రకాన్ని తెలుసుకోండి

ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా జుట్టు ఉండదు. కొందరి జుట్టు సిల్కీగా ఉంటే, మరికొందరికి ఉంగరాలు జుట్టు, చిక్కుముడిగా, జిడ్డుగా ఉండే జుట్టు ఉంటుంది. జిడ్డుగా ఉన్నంత మాత్రాన ప్రతి రోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ తో జుట్టు బాగా ఆరేలా చూసుకోవాలి.

వేడి నీరు వద్దు

అస్సలు శరీరానికి అయిన , తలకు అయినా చన్నీటి స్నానం ఉత్తమమని చెబుతారు. అలాంటిది తలకు ఎక్కువగా వేడి నీటిని వాడటం వలన జుట్టు బలహీనపడుతుంది. అందుకని పొడి జుట్టు ఉన్నవారు వారిని రెండు సార్లు, సాధారణ జుట్టు కలిగిన వారు వారానికి మూడుసార్లు చన్నీటితో తలస్నానం ఉత్తమం.

ఎంత అందంగా ఉన్నవారికైనా సరే జుట్టు మరింత అందాన్ని తెస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ ఈ విషయాలు తెలిసేలా SHARE చేయండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon