Link copied!
Sign in / Sign up
5
Shares

స్త్రీ శరీరానికి అత్యంత అవసరమైన ఐరన్ ఈ 5 పండ్లలో ఉంటుంది


స్త్రీ శరీరానికి చాలా అవసరమైన మినరల్.., ‘ఐరన్’. చాలా మంది మహిళలను అధికంగా వేధించే సమస్య రక్త హీనత. అందుకు ఐరన్ లోపం ప్రధాన కారణం. శరీరంలో ఐరన్ లోపించినప్పుడు, హెమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది. ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి ఐరన్ చాలా అవసరం. అందుకే ఐరన్ సహజంగా అందించే ఈ పండ్లను మీ రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి…

1. అంజీర

అంజీరాను తాజాగా లేదా ఎండినవి తినచ్చు. కానీ ఎండిన అంజీరాలో పోషక విలువలు రెండింతలు ఉంటాయి. వీటిని రాత్రి పూట నీటిలో నానపెట్టి, ఉదయం తినడం చాలా మంచిది. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తప్పనిసరిగా వీటిని తినడం చాలా అవసరం.

2. ఎండు ద్రాక్ష

ఎండు ద్రాక్షలో సహజమైన చక్కరతో పాటు, ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. వీటిని రోజు తినడం వలన మీ శరీరానికి కావాల్సిన ఐరన్ మీకు అందుతుంది. మీరు చేసుకునే స్వీట్స్ లో వీటిని వాడండి.

3. దానిమ్మ

ఏ రకమైన రక్త సమస్యకైనా పరిష్కారం దానిమ్మ. ఇది రక్తంలోని హెమోగ్లోబిన్ శాతాన్ని పెంచతుంది. రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు తాజా దానిమ్మను నేరుగా లేదా జ్యూస్ గా తీసుకోడానికి ప్రయత్నించండి. మీ శరీరానికి కావాల్సిన ఐరన్ ను అందిస్తుంది.

4. ఖర్జురమ్

ఇవి శక్తితో కూడిన ఆహరం, పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయి, ఐరన్ తో నిండి ఉంటుంది. మీ శరీరంలో ఐరన్ లోపిస్తే మీరు తప్పకుండా తినాల్సిన ఆహారంలో ఖర్జురమ్ ఒకటి. ఉదయం పూట రోజు 3-4 ఖర్జురాలు రోజు తినడానికి ప్రయత్నించండి.

5. ఆప్రికాట్స్

ఇవి ఈ మధ్య అన్ని సూపర్ మర్కెట్స్ లో దొరుకుతున్నాయి. వీటిలో విటమిన్లు, కార్భోహైడ్రేట్ల తో పాటు ఐరన్ కూడా ఉంటుంది. డ్రై ఆప్రికాట్స్లో మీ శరీరానికి కావాల్సిన ఐరన్ రెండింతలు ఉంటుంది. ఇవి మంచి రుచిగా కూడా ఉంటాయి. వీటిని తప్పకుండా తీసుకోండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon