Link copied!
Sign in / Sign up
3
Shares

శృంగారానికి ముందు ఈ ఆహారాన్ని అస్సలు తీసుకోకండి


శృంగారం అనేది దంపతులను మరింత దగ్గర చేస్తూ ఆనందాన్ని మరియు ఆరోగ్యాన్ని ఇచ్చే అందమైన ప్రక్రియ. మరి ఆ ఆనందాన్ని శృంగారం సమయంలో పొందాలంటే శృంగారానికి ముందు ఇక్కడ చెప్పుకునే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఆ ఆహార పదార్థాలు ఏవో మీరే చూడండి.

1.ఆల్కహాల్

మద్యం ఎక్కువగా సేవించడం వలన శృంగారంలో ఎక్కువ సమయం ఆనందంగా గడపవచ్చు అనుకోవడం పొరపాటు. మద్యం సేవించి శృంగారంలో పాల్గొంటే ఏ చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అస్సలు తెలీదు మరియు నిద్ర మత్తుకు దారి తీస్తుంది. దీని కారణంగా మీ భాగస్వామి అసంతృప్తి చెందాల్సి వస్తుంది.

2.బీన్స్

నిజానికి బీన్స్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారమే కానీ రతిలో పాల్గొనాలి అనుకునేముందు వీటిని తినకపోవడం మంచిది. వీటిని తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు తలెత్తి శృంగారానికి ఇబ్బంది కలిగిస్తాయి.

3.ఉల్లిపాయ

శృంగారంలో బాగా పాల్గొనడానికి చాలామంది సూచించే ఆహార పదార్థాలలో ఉల్లిపాయ ఒకటి కానీ శృంగారానికి ముందు ఇది తీసుకోవడం వలన చెమట ఎక్కువగా బయటకు రావడం, శరీర దుర్వాసన కలిగించడం చేస్తుంది.

4.మాంసం

ఈ రోజు సెక్స్ లో పాల్గొనాలి అని ప్లాన్ చేసుకునే దంపతులు మాంసం తినకపోవడం మంచిది. ఎందుకంటే మాంసం హార్మోనల్ ఇమ్ బ్యాలెన్స్ కారణం అవుతుంది అలాగే త్వరగా జీర్ణం కావడానికి టైం పట్టడమే కాకుండా కడుపు ఉబ్బరంగా ఉండేలా చేస్తుంది. కొందరికి మాంసం తిన్న వెంటనే నిద్ర వచ్చే అవకాశం కూడా ఉంది.

5.వెన్న

సెక్స్ లో పాల్గొనే ముందు వెన్న, మీగడ పదార్థాలను తీసుకోవడం వలన హార్మోన్ ఇమ్ బ్యాలెన్స్ కు కారణమై శృంగారం పట్ల అసంతృప్తిని కలిగిస్తాయి. అలాగే కూల్ డ్రింక్స్ ను రతిలో పాల్గొనేముందు తీసుకోకూడదు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే LIKE చేయండి, SHARE చేయండి. మరింత సమాచారం కోసం, ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే COMMENT చేయండి.

ఇవి కూడా చదవండి

భారతీయ దంపతుల కోసం 5 బెస్ట్ సెక్స్ పొజిషన్స్ (శృంగార భంగిమలు)...చిత్రాలతో!!

 భార్య భర్తల మధ్య తప్పకుండా జరగాల్సిన 9 సెక్సీ విషయాలు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon