Link copied!
Sign in / Sign up
3
Shares

శృంగారంలో రక్తం కారడానికి కారణాలు : రక్తం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పెళ్లైన దంపతులు అడిగిన ప్రశ్న ఇది. శృంగారం చేస్తున్నప్పుడు లేదా శృంగారం తర్వాత మా ఆయనకు ఒకసారి, నాకు అప్పుడప్పుడు చెప్పుకోలేని ప్రదేశాలలో రక్తం పడిపోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పుకున్నారు. నిజానికి శృంగారం చేస్తున్నప్పుడు లేదా శృంగారం తర్వాత రక్తం లీక్ అవ్వడం సాధారణమే కానీ ఇలా ఎందుకు జరుగుతుందో తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ఇది సాధారణం భయపడకండి

ఎస్..మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు రక్తం పడటం అనేది సాధారణమే అని అంటున్నారు అనుభవజ్ఞులైన వైద్యులు. యోని భాగం చాలా సున్నితంగా ఉండటం వలన, యోని చుట్టూ తడిదనం లేక ఆరిపోయినప్పుడు, యోని పొరల వద్ద చీలిక జరిగినప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. రక్తం ఎక్కువసేపు ప్రతిసారీ లీక్ అవుతూ ఉంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించాల్సిందే.

మగవారిలో రక్తం పడిపోతుంటే

చాలా రోజుల తర్వాత లేదా శృంగారంపై కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ గా, ఆవేశంగా రతి క్రీడలో పాల్గొనడం వలన అంగ ప్రవేశం చేస్తే అంగంపై ఉండేటటువంటి పలుచటిభాగం చీలి రక్తం కారడం జరుగుతుంది. ఇది కూడా ఎక్కువసేపు ఉండదు కానీ కొన్ని రోజుల వరకు లేదా అంగం గట్టిపడినప్పుడు నొప్పి, మంట కలగడం జరుగుతుంది. అందుకని మగవారిని సెక్స్ లో నెమ్మదిగా ఉండమని చెప్పాలి. ఇది మహిళలకు మంచిదే, ఎక్కువ ఫోర్స్ చేస్తే యోనిపై ప్రభావం చూపి రక్తం వస్తుంది.

పీరియడ్స్ సమయంలో

పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనడం వలన..ఈ సమయంలో సెక్స్ అనేది దంపతుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ సమయంలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. అలాగే పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం వలన రక్తం వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈస్ట్రోజన్ తక్కువగా ఉంటే

శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉండటం కూడా సెక్స్ లో రక్తం కారటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ హార్మోన్ లెవల్స్ సరిగ్గా ఉన్నట్లయితే యోని చుట్టూ పొరలు దృఢంగా, బలంగా ఉంటాయి. అదే హార్మోన్ తక్కువ అవ్వడం వలన యోని భాగం సున్నితంగా, పొడిగా మరియు తాకితేనే మంటపుట్టే విధంగా కాబట్టి రక్తం కారడానికి కారణం.

మొదటిసారి సెక్స్

చాలామందిలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మొదటిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు భయంగా, ఆతృతగా, ఆవేశంగా చేయడం వలన ఇద్దరిలోనూ రక్తం పడటం అనేది సర్వ సాధారణమే. అలా కాకుండా దంపతులలో ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటే మాత్రం డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది. ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే మరీ మంచిది.

ఈ విషయంపై చాలామందికి భయాందోళనలు ఉన్నాయి, కాబట్టి అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon