Link copied!
Sign in / Sign up
4
Shares

శృంగారంలో దంపతులు చేస్తున్న సాధారణ తప్పులు : ఇకపై ఆ తప్పులు జరగకుండా

శృంగారం దంపతుల మధ్య సంతోషాన్ని రెట్టింపు చేసే ప్రక్రియ. అయితే చాలామంది దంపతులు శృంగారంలో సరైన సంతృప్తి పొందలేకపోతున్నామని అంటుంటారు. దీనికి కారణం ఆ సమయంలో దంపతులు ఈ తప్పులు. శృంగారంలో జరుగుతున్న ఆ సాధారణ తప్పులేంటి, వాటి నుండి ఎలా బయటపడాలో తెలుసుకుందాం..

భయాన్ని దూరం పెట్టండి

పెళ్లి అయి చాలా రోజులు, నెలలు గడుస్తున్నా ఇద్దరూ ఒకటై శృంగారంలో పాల్గొనడానికి జంకు, భయంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ముందుగా మీ ఇద్దరి మధ్య ఆ భయాన్ని వదిలేసి శృంగారంలో ఆనందాన్ని పొందితే కలిగే ఆ ఆనందమే వేరు.

ఫోర్ ప్లే

మహిళలు శృంగారంలో వెంటనే భావప్రాప్తి పొందలేరు. ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మగవాళ్ళు ఫోర్ ప్లే కోసం ఎక్కువసేపు కేటాయించాలి. ఎక్కువ సమయం ఈ విధంగా చేయడం వలన శృంగారంలో ఆనందాన్ని పొందగలరు. అయితే ఎక్కువశాతం మంది ఈ విషయంలో దృష్టి పెట్టడం లేదు.

బెట్టు చేయకూడదు

ప్రతి మగాడికీ తన భార్యతో రతిలో పాల్గొనాలని కోరుకుంటూ ఉంటాడు. ఇందులో తప్పేమీ లేదు. అయితే మహిళలు ఈ విషయంలో కోరికలు ఉన్నా కూడా బయటకు చెప్పకపోవడం, భర్త ఆసక్తి చూపిస్తున్నా వద్దు వద్దు అని బెట్టుచేయడం వారికి నచ్చదు. కాగా ముందుముందు కూడా మీతో శృంగారంలో పాల్గొనేందుకు అయిష్టంగా ఉంటారు.

దూరం వెళ్ళకూడదు

ఫోర్ ప్లే అయిన క్షణాలలోనే స్కలనం జరిగితే భార్య నుండి భర్త దూరంగా వెళ్లడం వలన వారు ఆసక్తి కోల్పోతారు. ప్రతిసారీ ఈ విధంగా జరిగితే వారికి శృంగారంపై మోజు తగ్గుతుంది.

భంగిమలు

ఎప్పుడూ ఒకే భంగిమలు పాటించడం వలన శృంగారం అంటే ఇంతేనా అనే ఆలోచనలో పడతారు మహిళలు. అందుకని ఎప్పటికప్పుడు కొత్తగా చేయడం, కొత్త భంగిమలు ప్రయత్నించడం వలన వారు కూడా ఉత్సాహంగా ఉంటారు.

నీలి చిత్రాలు

భార్యాభర్తలు కలిసి నీలి చిత్రాలు, పోర్న్ వీడియోస్ తరచూ చూడటం వలన శృంగారంపై అయిష్టం కలుగుతుంది. ఫలితంగా పడకగదిలో మజాని పొందలేరు.

ఇలా చేయండి

శృంగారంలో వెంటనే ఫోర్ ప్లే మొదలుపెట్టకుండా వారికి శృంగారంపై ఆసక్తి, ఇష్టం కలిగేలా ముద్దులు పెట్టడం, కొన్ని భాగాలను తాకుతూ రొమాన్స్ చేయడం వలన మీతో శృంగారానికి ఎప్పుడూ సిద్ధంగా, ఇష్టంగా ఉంటారు.

చాలామంది దంపతులు శృంగారంలో ఈ చిన్న చిన్న సాధారణ తప్పులు చేస్తున్నారు. ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ దాంపత్య జీవితం మరింత సంతోషంగా ఉంటుంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

భర్త నుండి భార్య కోరుకునే 10 రొమాంటిక్ పనులు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon