Link copied!
Sign in / Sign up
1
Shares

శృంగారంలో ఆడవాళ్లు ఇలా చేస్తే మగవారికి నచ్చదు

శృంగారం అనేది దంపతుల మధ్య బంధాన్ని మరింత బలం చేసేదిగా భావించాలి కానీ శృంగారం గురించి మీ భర్త లేదా మీరు తప్పుగా ఆలోచించకూడదు. భార్యభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను కూడా ఒక్క పడకగదిలో మాత్రమే చక్కటి పరిష్కారం పొందగలరు మరియు ముందు జరిగిన విషయాలను, ఒకరిపై ఒకరికి ఉన్న కోపాన్ని మర్చిపోగలరు. అయితే శృంగారంలో ఆడవారు ఈ విధంగా చేస్తే మగవారికి నచ్చదు. అవేంటో మీరే చూడండి.

బెట్టు చేస్తుంటే

ఆరోగ్య పరిశోధనల ప్రకారం శృంగార కోరికలు మగ, ఆడ ఇద్దరి మధ్య సమానమే అని అంటున్నారు. అయితే పడకగదిలోకి వచ్చేసరికి మగవారు తమ భార్యలను ఎక్కువ సేపు బ్రతి మాడాల్సి వస్తోందని ఎక్కువ మంది భర్తలు చెప్పిన మాట. సో, ఈ విధంగా రతిక్రీడ సమయంలో మహిళలు బెట్టు చేయడం మగవారికి నచ్చని విషయం.

ఛీ దూరం జరగండి

భార్యపై భర్త చేతులు వేస్తున్నప్పుడు కానీ దగ్గరగా వస్తున్నప్పుడు మహిళలు ఛీ దూరంగా వెళ్ళండి అనే మాటలు ఇష్టపడరు. ఈ మాటలు అనడం వలన భర్తలు ఫీలవుతారట. దానికి బదులుగా ఈరోజు నాకు ఇష్టం లేదని ముందే చెబితే మిమ్మల్ని, మీ మాటలను గౌరవిస్తారు కూడా. అలాగే మీకు ఇష్టమైన వాటిని తీసుకురాలేదని వారిని దూరం పెట్టడం వారికి నచ్చని మరో విషయం.

ఇంకా ఎంతసేపు ఇలా..

కొన్నిసార్లు రతిక్రీడలో ఎక్కువ సమయం గడపాలని భర్తలు కోరుకుంటారు. ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు, అధిక టెన్షన్ కారణంగా శృంగారం ఎక్కువ సమయం కావాలనుకుంటుంటారు. అటువంటప్పుడు ఇంకా ఎంత సేపు ఇలా..అని చిరాకు తెచ్చుకోవడం, అయిష్టం చూపడం అంటే మగవారికి నచ్చని మరో విషయం. అయితే మహిళలు అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా వారికి బాధాకరంగా ఉంటే మాత్రం వద్దని డైరెక్ట్ గా చెప్పాలి.

ఎంకరేజ్ చేయకపోతే

మగవారు పడకగదిలో ఇష్టంగా ఉన్నప్పుడు, రతిక్రీడలో ఎక్కువ ఆనందాన్ని పొందేది భార్య సంతృప్తిగా, సంతోషకరంగా ఉన్నప్పుడే. మహిళలు భావప్రాప్తి పొందారు అనేది మగాళ్లకు చాలా సులభంగా అర్థమవుతుంది. అంటే శృంగారంలో ఇష్టంగా పాల్గొంటూ వారు కూడా సపోర్ట్ చేస్తుంటే ఇష్టం ఉన్నట్లు, నాకు ఎందుకులే అని అయిష్టంగా ఉంటే వారికి ఇష్టం, సంతోషం కలగదు. ఇద్దరూ ఇష్టంగా పాల్గొనడం వలన ఒత్తిడి, ఆందోళనలు ఉండవు.

అలాగే ఎప్పుడు మగవారు ఒకే విధంగా ఒకే భంగిమలో చేయడం మహిళలు ఇష్టపడరని ఆరోగ్య పరిశోధనలు తెలుపుతున్నాయి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon