Link copied!
Sign in / Sign up
3
Shares

శృంగారం తర్వాత చేయకూడని పనులు

శృంగారం గురించి మాట్లాడుకోవడం, ఆ విషయాలు తెలుసుకోవడం అంటే తప్పు అనే అపోహ చాలామందిలో ఉంది. శృంగారం గురించి తెలుసుకోవడం, ఆలోచించడం తప్పు కాదు. సృష్టి ప్రకారం మగ, ఆడ మధ్య జరిగే ఓ ఆనందకరమైన ప్రక్రియ కాబట్టి తెలుసుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అయితే శృంగారం గురించి, శృంగారం తర్వాత ఎటువంటి పనులు చేయకూడదో చాలామందిలో కొన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అందుకని శృంగారం తర్వాత ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం…

1.శుభ్రం చేసుకోవాలి

చాలామంది శృంగారం తర్వాత అలాగే బెడ్ పై పడుకోవడం చేస్తుంటారు. ఈ విధంగా ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే ఇద్దరి మధ్య సంభోగం జరిగినప్పుడు ఇద్దరి శరీరాల నుండి స్కలనం జరగడం వలన ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి శృంగారం తర్వాత వెంటనే నీటితో ఆ ప్రదేశాలను శుభ్రపరచుకోవాలి.

2.యూరిన్ ఆపుకోకూడదు

శృంగారంలో పాల్గొన్న తర్వాత చాలామంది చేయని పనిలో యూరిన్ వెళ్ళకపోవడం. స్కలనం జరిగిన కొన్ని నిముషాల తర్వాత దంపతులు కచ్చితంగా యూరిన్ చేయడం చేయాలి. ఇలా చేయకపోతే ఏదో తెలియని నొప్పిగా ఉన్నట్లు మరియు ఇన్ఫెక్షన్స్ ఆ ప్రదేశంలో వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

3.లేచి వెళ్ళకూడదు

రెండు మనసులు, చీకటి గదిలో జరిగిన శృంగార కేళి తర్వాత దంపతుల మధ్య మరింత అనుబంధం ఆనందం కలుగుతుంది. అలా కాదని శృంగారం అయిపోయిన వెంటనే ఎవరికి వారు ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోవడం వలన మంచి రిలేషన్ మెయింటేన్ చేయలేరు. ఇద్దరి మధ్య అనుబంధం పెరగడానికి, మరుసటి రోజు శృంగారంలో ఆసక్తిగా పాల్గొనాలంటే ఒక రెండు నిముషాలు మాట్లాడుకుని బెడ్ పై నుండి లేవడం చేస్తే మంచిది.

4.లో దుస్తులు

శృంగారంలో పాల్గొనకున్నా లేదా రాత్రి నిద్రించే సమయంలోనైనా సరే లో దుస్తులు ధరించి అస్సలు నిద్రించకూడదు. ఈ విధంగా చేయడం వలన జననాంగాల వద్ద వేడి పుట్టి శృంగారంలో ఆసక్తిని తగ్గిస్తుంది. రోజు మొత్తంలో వేసుకున్న లో దుస్తులను కనీసం రాత్రి నిద్రించే సమయంలో ధరించకపోవడం వలన స్కిన్ రాషెష్, ఇన్ఫెక్షన్స్ కలగకుండా ఉండాలని, జననాంగాలకు చల్లని గాలి తగులుతుందనే లో దుస్తులు వద్దని చెబుతున్నారు.

ఇంకా మీకు ఏమైనా అనుమానాలు, ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలంటే మాకు COMMENT చేయగలరు. ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే LIKE చేయండి మరియు SHARE చేయండి.

ఇవి కూడా చదవండి.

శృంగారానికి ముందు తప్పకుండా తీసుకోవాల్సిన శక్తిని పెంచే 6 ఆహారాలు

భారతీయ దంపతుల కోసం 5 బెస్ట్ సెక్స్ పొజిషన్స్ (శృంగార భంగిమలు)...చిత్రాలతో!!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon