Link copied!
Sign in / Sign up
31
Shares

శృంగారం చేయడం ఆపేస్తే మీ శరీరానికి ఏమవుతుంది?

కొంతంది మహిళలు కొంత వయసు వచ్చాక, సెక్స్ లో పాల్గొనడం తగ్గిస్తారు. కొంతమంది ఆ అనుభవానికి పూర్తి దూరం కూడా కావచ్చు.  దీనికి అనేక కారణాలు ఉండి ఉండచ్చు. కానీ పూర్తిగా సెక్స్ చేయడం ఆపేసిన తరువాత, మీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. యోని బిగువు

చాలామంది అనుకునేటట్టు కొంత కలం సెక్స్ చేయడం ఆపేయడం వలన యోని బిగువవుతుంది, అన్నది నిజం కాదు. మీరు సెక్స్ చేస్తున్న సమయంలో యోని ఎంత బిగువుగా ఉందో, తరువాత కూడా అలానే ఉంటుంది.

2. రోగనిరోధక శక్తి

చాలా అధ్యయనాల ప్రకారం, సెక్స్ చేయడం మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అని తేలింది. కాబట్టి మీరు సెక్స్ చేయడం తగ్గించడం, లేదా పూర్తి మానేయడం మీ రోగ్ నిరోధక శక్తిని తగ్గించచ్చు.

3. సెక్స్ మీద ఆసక్తి

సెక్స్ ఎక్కువ కాలం చేయకుండా ఉండడం, మీ శారీరక, మానసిక లైంగిక వాంఛలను తగ్గిస్తుంది. అంటే మీకు సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోవచ్చు.

4. ఒత్తిడి

అధ్యయనాల ప్రకారం, రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనని వాళ్ళలో, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అని తేలింది. దీని ప్రకారం మీరు సెక్స్ చేయడం పూర్తిగా ఆపేస్తే, మీలో ఒత్తిడి స్థాయి పెరుగవచ్చు.

5. గుండె ఆరోగ్యం

మంచి సెక్స్ జీవితం మీ గుండెను ఆరోగ్యాంగా ఉంచుతుంది. సెక్స్ చేయడం వలన మీ శరీరంలో జరిగే వ్యాయామం మీ గుండె ఆరోగ్యం కోసం చాలా అవసరం. ఒకవేళ మీరు సెక్స్ చేయడం మానేసిన, వ్యాయామం మొదలుపెట్టడం మంచిది. అది గుండెను ఆరోగ్యాంగా ఉంచుతుంది.

6. లూబ్రికేషన్

సాధారణంగా సెక్స్ కోరికలు కలిగినప్పుడు, యోని లో తడి ఏర్పడుతుంది. ఇది సెక్స్ సమయంలో లూబ్రికేషన్ గా ఉపయోగపడుతుంది. కొంత కాలం సెక్స్ చేయకపోవడం వలన యోని లో తడి ఆలస్యం అవచ్చు , లూబ్రికేషన్ ఉండదు.

7. తెలివితేటలు

సెక్స్ మీ మెదడులోని న్యూరోన్ లను ఉత్తేజపరుస్తాయి. ఇవి తెలివి తేటల మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.   సెక్స్ చేయడం తగ్గిస్తే తెలివితేటలు తగ్గే అవకాశం ఉంటుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon