Link copied!
Sign in / Sign up
16
Shares

శృంగార సమయంలో ఆడవాళ్లు మగవాళ్లలో ఏం గమనిస్తారో తెలుసా..!

వైవాహిక బంధం తర్వాత శృంగారం గురించి మాట్లాడుకోవడం అనేది మన దేశంలో తప్పుగా, సిగ్గుగా భావిస్తుంటారు. నిజానికి భార్యాభర్తల మధ్య బంధం మరింత దృఢంగా ఉంచేందుకు శృంగారం కూడా ఒక మధ్యవర్తిగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలరు. అయితే పడకగదిలో మాత్రం మగవారికంటే ఆడవారికి కొంచెం సిగ్గు, భయం ఉంటాయనేది నిజమే. కాగా, శృంగార సమయంలో అసలు మహిళలు మగవారిలో ఏం గమనించాలో తెలుసుకోండి.

భర్త ఆనందంగా ఉన్నాడా? లేదా?

భార్యాభర్తల మధ్య శృంగారం జరుగుతున్నప్పుడు భార్య ఒక మెషిన్ లా కాకుండా భర్త ఆనందంగా ఉన్నాడా, లేదా..  నా భర్తకు నేను సరిగ్గా సహకరిస్తున్నానా..లేదా!, శృంగారంలో ఆయన తృప్తి పొందారా లేదో అడగాలి. అడగలేకపోయినా ఆ సమయంలో మీ ఆయన ఉత్సాహంగా  పాల్గొంటుంటే ఆనందంగా ఉన్నట్లే.

ముద్దులు పెట్టుకోకపోతే..!

శృంగార సమయంలో ప్రతి దంపతుల మధ్య జరిగేది ఒకరిపై ఒకరు ముద్దులు పెట్టుకోవడం. రతిక్రీడను రెట్టింపు చేయడానికి ముద్దులు బాగా సహకరిస్తాయి. అయితే కొందరు భర్తలు భార్య శరీరంపై, కొన్ని భాగాలలో ముద్దు పెట్టుకోవడానికి అయిష్టంగా ఉంటారు. ఒకటి ఆ భాగాలలో దుర్వాసన వస్తుండటం లేదా భార్యను అక్కడ టచ్ చేస్తే ఏమనుకుంటుందో అన్న భయం అయ్యుండవచ్చు. అందుకని మహిళలే అడిగి తెలుసుకోవాలి.

త్వరగా వీర్యం పడిపోతుంటే

భార్యాభర్తల మధ్య ఆనందకరమైన రతిక్రీడ జరుగుతున్నప్పుడు మహిళలకు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఐతే ఇదే టైంలో కొంతమంది మగవారిలో త్వరగా వీర్యం పడిపోవడం జరిగి వారిని చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఎందుకంటే త్వరగా పూర్తి చేయాలన్నా ఒత్తిడి, ఆందోళన మరియు శృంగార సామర్థ్యాన్ని తగ్గించే ఆహారం ఎక్కువగా తీసుకోవడం వలన ఇలా అవుతుంది.

కళ్ళలోకి చూస్తూ కురులు పట్టుకోవడం చేస్తుంటే

చాలామంది సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఉద్రేకంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు. ఐతే శృంగారం పూర్తయ్యాక / శృంగారం సమయంలో భార్య కళ్ళలోకి చూస్తూ కురులను తాకుతూ ఉంటే భర్తకు ఇంకా శృంగారం కావాలని మరియు భార్యపై ఉన్న ప్రేమకు గుర్తు.

మొదట్లో ఇష్టంగా ఉండి తర్వాత దూరం వెళ్తుంటే

సెక్స్ అనగానే ఎంతో ఇష్టపడి, ఆసక్తి చూపిన మగవారు తీరా ఆ సమయం రాగానే ఎందుకో దూరంగా వెళ్తూ ఉంటారు. అసలు రీజన్ ఏంటన్నది త్వరగా బయటకు చెప్పరు, కానీ భార్య దగ్గరకు తీసుకుని సమస్య ఏంటో అడిగితే చెబుతారు. నిజంగా ప్రాబ్లమ్ అదే ఐతే మహిళలే అందుకు పరిష్కారం తెలుసుకోవాలి.

అవగాహన, అనుభవం ఉన్న ఆరోగ్య నిపుణులు చెప్పిన విషయాలు ఇవి. మీకు నచ్చితే SHARE చేయండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon