Link copied!
Sign in / Sign up
5
Shares

శృంగార సమయంలో మగవారికి ఆడవారిలో ఈ 4 విషయాలు నచ్చవు

శృంగార సమయం అనేది దంపతుల మధ్య ఉండే కోపతాపాలు, ఈర్ష్య, ద్వేషాలను పక్కకు తోసి మర్చిపోలేని సంతోషాలను,  ఇతర విషయాలను దగ్గరికి రానివ్వకుండా, ఆలోచించకుండా చేసే అందమైన ప్రక్రియ. ఐతే ఈ ప్రక్రియలో మగవారికి ఆడవారిలో కొన్ని విషయాలు అస్సలు నచ్చవు. అవేంటో తెలుసుకుని భర్త మనస్సును ప్రతి భార్య అర్థం చేసుకోవాలని ఆశిస్తూ…

ముఖం చిరాకుగా పెట్టడం

పడకగదిలోకి ఎంతో సంతోషంగా శృంగారం చేయడానికి భర్త సిద్ధంగా ఉన్నప్పుడు ఇష్టం లేనట్లుగా దూరం జరగడం, ముఖం చిరాకుగా పెట్టడం మగవారు అస్సలు తట్టుకోలేరు. అందుకు బదులుగా ఈ రోజు వద్దు అని చెబితే సైలెంట్ అవుతారు. ఇలా కాకుండా దూరంగా వెళ్లడం వలన  మీ ఆయనకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. నేనంటే నా భార్యకు ఇష్టంలేదేమో అని భయం మొదలవుతుంది.

మీ ఇష్టాలు, కోరికలు మొదలుపెట్టద్దు

అవును భార్యకు నచ్చినవి, ఇష్టమైనవి, తన కోరికలు తీర్చుకోవడానికి పడకగదే సరైనదని మహిళలు ఎక్కువగా భర్తల వీక్ నెస్ పై కొడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా మీ ఇష్టాలు తీర్చుకోవడం తప్పేమీ కాదు గానీ మీ భర్త ఎంజాయ్ చేయడానికి మధ్యలో ఈ కోరికల చిట్టా మొదలుపెడితే మగవారికి నచ్చవట.

కళ్ళలోకి చూడకపోతే..

శృంగార సమయంలో సాధారణంగా మగవారు తమని చూస్తున్నారా లేదా అని గమనిస్తూ ఉంటారట. ఇలా చూడకపోతే మహిళలు అయిష్టం చూపిస్తారట. అలాగే మగవారు కూడా అన్ని సందర్భాలలో కాకపోయినా కొన్నిసార్లు తన భాగస్వామి నన్ను చూస్తుందా లేక చూపు పక్కకు తిప్పకుందా అని చూస్తారట. చూస్తుంటే చాలా హ్యాపీ అవుతారు. అదే చూడకపోతే చాలా డిజప్పాయింట్ అవుతారు.

స్కలనం కాగానే వెళ్లిపోవడం

మగవారు ఎక్కువగా స్కలనం కాగానే మహిళలకు దూరంగా జరగడం చేస్తుంటారు. అటువంటప్పుడు మహిళలు బలవంతం చేస్తే వారికి నచ్చదు. కొన్ని నిముషాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ చేయడానికి ఉత్సాహం చూపిస్తారట. వెంటవెంటనే బలవంతం చేయడం వలన కోపం తెచ్చుకునే అవకాశం ఉంది.

నత్తనడకగా సాగిస్తే..

శృంగారంలో నత్తనడకగా సాగించడం, ఇష్టం లేనట్లుగా మగవారికి నచ్చని మరో అంశం. అలాగని ఎక్కువ ఫోర్స్ గా చేయడం మహిళలకు ఇష్టం ఉండదు మరియు దంపతులు ఇద్దరికీ ప్రమాదమే కాబట్టి శృంగారంలో ఎంత నెమ్మదిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సాగిస్తే సంతోషకరంగా ఉంటారు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon