శ్రీదేవిని గౌరవించండి, మమ్మల్ని మనసారా ఏడవనివ్వడి : మీడియాకు శ్రీదేవి కుటుంబం లేఖ
అతిలోక సుందరిగా కోట్లాది అభిమానుల్ని తన అందం అభినయంతో అలరించిన శ్రీదేవి గారు 5 రోజుల క్రితం ఈ ప్రపంచానికి దూరమైన సంగతి తెలిసిందే. అయితే 4 రోజులుగా శ్రీదేవి మృతిపట్ల గౌరవం లేకుండా మీడియాలో వస్తున్న కథనాలు శ్రీదేవి కుటుంబ సభ్యులను మనస్సును గాయపరిచాయి. మమ్మల్ని మనసారా దుఃఖపడనివ్వండి అంటూ మీడియాకు గౌరవంగా శ్రీదేవి భర్త మరియు ఫ్యామిలీ మెంబర్స్ రాసిన లేఖ అందరినీ బాధిస్తోంది. ఆ లేఖలో ఏం రాశారంటే..
బోనీ కపూర్ మీడియాకు రాసిన లేఖ..
మా బలం, మా నవ్వుకు కారణమైన మా శ్రీదేవిని మేం కోల్పోయాం. మమ్మల్ని మనసారా బాధపడనివ్వండి, ఆమెను ప్రేమించండి, గౌరవించండి అంటూ మీడియాకు బహిరంగంగా లేఖ రాశారు. మీ అందరికి ఆమె శ్రీదేవి, చాందిని.. నాకు మాత్రం ఓ మంచి స్నేహితురాలు, నా బిడ్డలకు మంచి తల్లి, మా పిల్లలు ఖుషి, జాన్వీలకు ఆమె సర్వస్వము, మా ప్రేమమూర్తి శ్రీదేవి. మా బాధలో తోడుగా నిలిచిన ఆత్మీయులు, స్నేహితులు, అభిమానులు ప్రతి ఒక్కరికీ మా హృదయ పూర్వక ధన్వవాదాలు తెలిపారు. బోనీ కపూర్ రాసిన ఆ లేఖ ఇదే…

ప్లీజ్ ఒకరి మరణం పట్ల అలా చేయకూడదు

ఎవరి జీవితంలో పుట్టుక, మరణం సాధారణమే. మనతో స్నేహంగా గడిపిన వ్యక్తి, ప్రేమను పంచిన వ్యక్తి ఇక మనతో లేరు అంటే ఆ బాధను మాటల్లో చెప్పుకోలేం. కానీ గత 4 రోజులుగా కొంతమంది శ్రీదేవి గారి మృతిపట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇదే శ్రీదేవి కుటుంబాన్ని బాధించింది. అందుకే మా ప్రియమైన వ్యక్తి మాకు దూరం అయ్యారనే బాధలో ఉన్నాం, ఆమెను గుర్తు చేసుకుంటూ ఏడవటానికైనా మమ్మల్ని వదిలేయండి అంటూ ఎంతో బాధగా లేఖను రాశారు.
శ్రీదేవి గారు అనే కాదు ఏ ఒక్కరూ వారి కుటుంబం నుండి దూరమైనా సరే వారికి కలిగే బాధలో ఇతరులు మరింత బాధించకూడదు.
