Link copied!
Sign in / Sign up
0
Shares

శ్రీదేవి చనిపోయాక కూతురు జాన్వి తన బర్త్ డేను ఎలా జరుపుకుందో చూడండి : వీడియో

అతిలోక సుందరిగా ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి గారు ఫిబ్రవరి 24 న దుబాయ్ లో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. తన పెద్ద కూతురు జాన్వి కపూర్ బర్త్ డే కోసం షాపింగ్ చేయడానికే ఆ సమయంలో దుబాయ్ లో ఉన్నారట. అమ్మ లేకుండా మొదటిసారి జాన్వి తన బర్త్ డే వేడుకలను వృద్దాశ్రమంలో జరుపుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు.

అమ్మ లేకుండా మొదటి బర్త్ డే..

ఎప్పుడు తనతో పాటు ఉండి, తన బర్త్ డేను గ్రాండ్ చేసే శ్రీదేవి ఈసారి మాత్రం తన పుట్టినరోజు నాడు లేకపోవడం జాన్వి కపూర్ కు కొంచెం బాధను కలిగించింది. నిన్న (మంగళవారం) తన 21 వ పుట్టినరోజును వృద్ధాశ్రమంలో పెద్దల సమక్షంలో జరుపుకుంది. అందరూ జాన్వికి బర్త్ డే విషెస్ తెలిపారు. అప్పుడప్పుడు శ్రీదేవి గారు కూడా అనాధాశ్రమం లేదా వృద్ధాశ్రమంలో తన పుట్టినరోజును జరుపుకునేవారు. తల్లి బాటలోనే నడుస్తున్న జాన్వి కపూర్ ఆ తర్వాత తన సోదరి సోనమ్ కపూర్ ఇంట్లో తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

 

అమ్మను చూడలేకపోయిన జాన్వి..

దుబాయ్ లో పెళ్లి వేడుకలకు శ్రీదేవి భర్త బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషి వెళ్లారు. తన మొదటి సినిమా షూటింగ్ లో భాగంగా జాన్వి ఇండియాలోనే ఉండిపోయింది. దుబాయ్ వెళ్లిన అమ్మను చివరిసారిగా చూడలేకపోయింది. ఏది ఏమైనా అమ్మ నింపిన ధైర్యంతో ముందుకు వెళ్తాను అని చెబుతోంది జాన్వి. జనన, మరణాలు సర్వసాధారణమే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండటమే కదా జీవితం..

మీ తరపున జాన్వీ కపూర్ కు హ్యాపీ బర్త్ డే అని తెలపండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon