Link copied!
Sign in / Sign up
46
Shares

కేక్ ఇంట్లోనే 20 నిముషాల్లో ఎలా తయారుచేసుకోవాలి..?

కేక్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ప్రస్తుతం సర్వ సాధారణం అయిపొయింది. అయితే ఈ సీజన్ లలో వారు అమ్మే ఖర్చులకు మధ్యతరగతి వాళ్ళు కొనడం చాలా కష్టం కాబట్టి, మీకోసం సింపుల్ గా ఇంటివద్దే యమ్మీ యమ్మీ అనిపించేలా కేక్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

క్రిస్మస్ కేక్ తయారుచేసుకోవడానికి కావలసిన పదార్థాలు

¾ కప్పుల ద్రాక్ష రసం లేదా ఆరంజ్ జ్యూస్

½ కప్పు డ్రై ఫ్రూట్స్

½ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా

1 కప్పు గోధుమ పిండి

½ కప్పు మొక్కజొన్న పిండి

1 టేబుల్ స్పూన్ బనానా పించ్

2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్

3 గుడ్లు

దాల్చిన చెక్క కొంచెం

1 కప్పు బ్రౌన్ షుగర్

¾ కప్పుల మంచి నూనె

వెనిలా

2 టేబుల్ స్పూన్ల ఆరంజ్ అభిరుచి

1 కప్ టూటీ ఫ్రూటీ (చెర్రీస్ పళ్ళ వంటివి)

కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

⇛ ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ¾ కప్పుల ద్రాక్ష రసం లేదా ఆరంజ్ జ్యూస్ ఉంచాలి.   ఆ తర్వాత ఇందులో ఒక కప్ టూటీ ఫ్రూటీలు, ½ కప్పు డ్రై ఫ్రూట్స్ మరియు ½ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కలుపుకుని బాగా మిక్స్ చేసి, ఒక గంటపాటు అలాగే ఉంచాలి.

⇛ ఒక పాత్ర తీసుకుని దాని చుట్టూ కొద్దిగా వెన్న లేదా ఆయిల్ తో పాత్ర చుట్టూ రాయాలి. ఆ తర్వాత అప్పు గోధుమ పిండి, ½ మొక్కజొన్న పిండి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ మరియు కొద్దిగా దాల్చిన చెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

⇛మరొక బౌల్ తీసుకుని అందులో 3 గుడ్లను పగులగొట్టి బాగా చిక్కగా అయ్యేవరకు మిక్స్ చేయాలి. ఆ తరవాత 1 కప్పు బ్రౌన్ షుగర్ అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత ¾ కప్పుల ఆయిల్ తీసుకుని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండి అరకప్పు మోతాదులో తీసుకుని అందులో వేసి బాగా ముద్దలా అయ్యేలా చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆరంజ్ అభిరుచి, కాస్త వెనిలా వేయాలి. టూటీ ఫ్రూటీలను మిక్స్ చేసి బౌల్ లో ఉంచిన వాటిని ఇందులో వేసి మిక్స్ చేయాలి.

⇛ ఈ మిశ్రమాన్ని ఒక సపరేట్ బౌల్ లోకి వేసుకుని కుక్కర్ లో 40 నిముషాలు పాటు మరీ ఎక్కువ మంట లేకుండా మీడియమ్ గా ఉంచుకోవాలి. ఆ తర్వాత అందులో నుంచి బయటకు తీసుకోవాలి. దీంతో మీ న్యూ ఇయర్ ‘ప్లమ్ కేక్’ రెడీ అయిపోయినట్లు…  

ఎలా తయారుచేసుకోవాలో మీరు ఈ వీడియోలో కూడా చూడవచ్చు..
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon