Link copied!
Sign in / Sign up
7
Shares

సోయా బీన్స్ తో సులభంగా రుచికరమైన వంటకాలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి

సోయా బీన్స్ ఆరోగ్యానికి ఎంత ఆరోగ్యకరమో, సోయా బీన్స్ తో ఆరోగ్యపరంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే సోయాను ఎలా తయారు చేసుకోవాలో తెలియక తినడానికి అయిష్టం చూపెడుతూ ఉంటారు. అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ చిట్కాల వలన  సోయా బీన్స్ తో రుచికరమైన వంటకాలను ఎలా తయారుచేసుకోవచ్చో చూడండి..

1.సోయా బీన్స్ తో దాల్ ఫ్రై ఎలా తయారుచేసుకోవాలి?

కావలసిన పదార్థాలు :

⇒సోయా బీన్స్ 250 గ్రాములు

⇒ టీ స్పూన్ కారం మరియు జీలకర్ర పొడి

⇒నాలుగు స్పూన్ల మంచి నూనె

⇒తగినంత ఉప్పు మరియు కరివేపాకు

తయారీ విధానం :

⇒ముందుగా సోయా బీన్స్ ను ఒక పాత్రలో తీసుకుని కొన్ని గంటలపాటు బాగా నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటి నుండి బయటకు తీసి ఆరనివ్వాలి.

⇒ఆ తర్వాత బౌల్ తీసుకుని అందులో నూనె వేసి నీటి నుండి బయటకు తీసిన సోయా బీన్స్ ను అందులో వేసి వేయించాలి. వేయించేటప్పుడు కారం, జీలకర్ర పొడి, ఉప్పు మరియు కరివేపాకు వేసి కొద్దిసేపు వేగాక స్టవ్ పై నుండి కిందకు దింపి ఆరబెట్టాలి.

ఆరబెట్టిన తర్వాత ఒక గిన్నెలో లేదా డబ్బాలో ఉంచుకోవచ్చు.

ఉపయోగాలు :

వీటిని బఠాణీ గింజలుగా ప్రతి రోజూ కొద్దిమొత్తంలో ఇవ్వడం వలన ఎదిగే పిల్లలకు చాలా మంచిది మరియు రుచికరంగా ఉండటం వలన ఎంతో ఇష్టంగా తింటారు.

2.సోయాతో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు :

అరకప్పు : సోయా బీన్స్

అర టీ స్పూన్ : జీలకర్ర పొడి

టేబుల్ స్పూన్ : నూనె

అరకప్పు : ఉల్లిపాయలు

తురిమిన కొత్తిమీర : రెండు స్పూన్లు

యాలకులు : మూడు

అరకప్పు : క్యారెట్ ముక్కలు మరియు పచ్చి బఠాణీ

ఇంగువ, ఉప్పు, దాల్చిన చెక్క : చిటికెడు రుచికోసం

ఒక కప్పున్నర : బాస్మతీ రైస్

అర టీ స్పూన్ : ధనియాల పొడి

అర టీ స్పూన్ : పసుపు

తయారీ విధానం :

⇒ముందుగా బాస్మతీ రైస్ ను ఒక బౌల్ లో వేసి బాగా కడగాలి. కడిగిన తరవాత మంచి నీళ్లు వేసి కొద్దిసేపు నానబెట్టాలి.

⇒ఒక కప్పు వేడి నీరు తీసుకుని అరకప్పు సోయా బీన్స్ లో వేసి కొన్ని నిముషాల పాటు నానబెట్టాలి. ఈ లోపు ప్యాన్ లేదా కుక్కర్ తీసుకుని అందులో కాస్త నూనె వేసి దాల్చిన చెక్క, జీలకర్ర మరియు యాలకులు వేసి వేయించాలి.

⇒అందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు కాస్త ఇంగువ వేసి వేయించాలి. ఇక ఆ తర్వాత అరకప్పు క్యారెట్ ముక్కలు మరియు పచ్చి బఠాణీలు, నానబెట్టిన బాస్మతీ బియ్యం, సోయా బీన్స్ అన్నిటినీ కలిపి వేయించాలి.

⇒కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాసింత పసుపు, తగినంత ఉప్పు కలుపుకుని మిక్స్ చేసుకోవాలి .

⇒ఇవన్నీ కలిపిన తరవాత మూడు కప్పుల నీటిని ఆ మిశ్రమంలో వేసి బాగా ఉడికించాలి. దీంతో సోయా బీన్స్ వెజ్ బిర్యానీ రెడీ అయినట్లు. చివరిగా తరిగిన కొత్తిమీర వెజ్ బిర్యానీపై వేయడం మర్చిపోకండి.

ఉపయోగాలు :

కొందరు పిల్లలు, మహిళలు సోయా, సోయాతో చేసిన వంటలంటే అస్సలు తినరు. కాబట్టి ఇలా సోయాతో వెజ్ బిర్యానీ చేసి వడ్డిస్తే చాలా ఇష్టంగా తింటారు. 

తప్పకుండా అందరికీ SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon