Link copied!
Sign in / Sign up
53
Shares

సొంత కొడుకు, కూతురిని తాడుకు వేలాడదీసి చావబాదిన కనికరం లేని తండ్రి : వీడియో తీసిన బాబాయ్

అస్సలు ఇలాంటి తండ్రులు ఉంటారా అనే విధంగా తన సొంత కొడుకు, కూతురిని దారుణంగా చావబాదిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటువంటి సంఘటనలు ఇలా జరుగుతూ ఉంటే తల్లితండ్రులతో కలిసి బ్రతకడానికి అస్సలు పిల్లలు ఉంటారా అనే విధంగా రోజుకొక దారుణం జరుగుతూ ఎంతోమంది తల్లులను కన్నీటికి గురిచేస్తుంది. తండ్రి అనే ఒకే ఒక్క కారణంతో ఇతను ప్రవర్తించిన తీరు హృదయాన్ని కలిచివేస్తోంది. ఆ వీడియో ఇదే.. దయచేసి ఇంకెవరూ ఇలా చేయకుండా SHARE చేయండి.

ప్యాంటుకు మట్టి అంటిందని..

రాజస్థాన్ లోని రాజసమానంద్ అనే ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం భారతదేశం అంతటా వైరల్ అయ్యింది. చైన్ సింగ్ అనే 32 ఏళ్ళ వ్యక్తికి 5 ఏళ్ళ కొడుకు, 3 ఏళ్ళ కూతురు ఉన్నారు. బయట ఆడుకుంటున్నప్పుడు ఆ పిల్లాడి ప్యాంట్ కు మరియు ఆ పాప డ్రస్ కు కాస్త మట్టి అంటుకుందని, కొడుకుని సీలింగ్ కు తాడుతో వేలాడదీసి ప్యాంటు విప్పి కొట్టాడు. అన్నను కొడుతుంటే 3 ఏళ్ళ కూతురు అక్కడి నుండి వెళ్ళుపోతుంటే కర్రతో లాగి మరీ కొట్టాడు.

వీడియో తీసిన సొంత బాబాయ్

తన సొంత కొడుకు, కూతురిని చావబాదుతుంటే వీళ్ళ తల్లి తన భర్తకు భయపడి దూరంగా వెళ్లిందట. ఐతే ఇలా తన బిడ్డలను కొడుతుంటే పక్కనే ఉన్న సొంత బాబాయ్ అయిన వాట్టా సింగ్ వీడియో తీశాడు. ఈ వీడియోను పోలీసులకు పంపగా పిల్లలను హింసించినందుకు తండ్రిని, ఈ పనిని ఆపకుండా వీడియో తీసినందుకు అతడి తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అన్నదమ్ములు ఇద్దరూ జైలులో ఉన్నారు.

ఛీ ఛీ అనిపించేలా ఇలా ప్రవర్తిస్తున్న కొంతమంది తల్లితండ్రులకు పిల్లల గురించి ఇంకెప్పటికి తెలుస్తుందో. ఇంకెవరికీ ఇలా జరగకుండా ఉండేలా దయచేసి SHARE చేయగలరు.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon