Link copied!
Sign in / Sign up
6
Shares

సోమవారం రోజు సాయంత్రం ఇలా చేస్తే మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు..

సోమవారం.. ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ప్రతి సోమవారం రోజున శివాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతూ ఉంటాయి. అయితే చాలామంది గృహిణిలు అడుగుతున్న ప్రకారం సోమవారం రోజు ఏం చేస్తే మంచిది..? అనే దానికి సమాధానమే ఇక్కడ మీ ముందుంచుతున్నాం. సోమవారం  రోజు ఏం చేస్తే మంచిదో, ఏం చేయకూడదో తెలుసుకోండి..

సోమవారం సాయంత్రం ఇలా చేస్తే..

ఇంతకుముందే చెప్పుకున్నట్లు ముక్కంటి అయిన పరమేశ్వరుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు తలంటుస్నానం చేసుకుని, ఉపవాసం ఉండాలనుకునేవారు ఉండవచ్చు లేదా ఉపవాసం లేకపోయినా ఏమీ కాదు. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, ఏదైనా శివాలయం గానీ, మరేదైనా గుడిలో లేదా మీ ఇంట్లో శివలింగానికి విభూదిని నీటిలో కలిపి అభిషేకం చేసుకోవాలి. ఇలా కాకపోయినా ఏదైనా పండ్ల రసాలతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు బిల్వ దళాలను ఉంచి పూజించాలి. ఇలా చేసుకున్న తర్వాత ఓం నమ: శివాయ అంటూ కొన్నిసార్లు ఆ శివయ్యను తలచుకుని చివరిగా హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వలన ఆ మహేశ్వరుడికి ఎంతో ఇష్టమట. మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయని అంటున్నారు మన పెద్దలు, పూజారులు.

సోమవారం రోజు చేయకూడని పనులు

ఇంట్లో పూజ చేసుకోవాలి, పరమేశ్వరుడిని పూజించుకోవాలి అనుకున్నవారు మాంసం, మసాలా పదార్థాలు, ఉల్లిపాయ, వెల్లుల్లికి, ధూమ మధ్యపానాలకు దూరంగా ఉండాలి. ఇవి ముట్టుకుని పూజ చేయటం వలన మీ పూజాఫలం అంతా వృధా అవుతుందని చెబుతున్నారు.

నువ్వుల నూనెతో దీపం వెలిగించుకుంటే..

పరమేశ్వరుడు ముందు దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించుకోవాలని అంటుంటారు. ఇలా ఎందుకు చేయాలి అనే దానికి కారణం కూడా లేకపోలేదు. మీరు వెలిగించిన దీపం వత్తి నుండి వచ్చే పొగ మానవ గుండె స్పందనను బలిష్టపరిచి హృదయ స్పందనను అదుపులో ఉంచుతుంది. సోమవారం రోజు సాయంత్రం పూజ చేయాలి అనుకునే గృహిణీ మహిళలు ఒంటరిగానే కాకుండా భర్తతో కలిసి పూజ చేయడం వలన పుణ్యఫలమే కలుగుతుంది.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon