Link copied!
Sign in / Sign up
10
Shares

గర్భంతో ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ సేవించడం కడుపులోని బిడ్డకు ప్రమాదమా..! అసలు నిజం తెలుసుకోండి

గర్భం దాల్చడం అనేది మహిళ జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చే అద్భుత క్షణాలు. అయితే ఈ సమయంలో ఎలా ఉండాలి, ఏం తినాలి ఏం తినకూడదు వంటి నియమాలు సరిగ్గా పాటించకపోవడం వలన గర్భం కోల్పోవడం జరుగుతోంది. అలా ఒక గర్భిణీ మహిళ అడిగిన ప్రశ్నలలో ఇది ఒకటి, గర్భంతో ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ (శీతల పానీయాలు) తాగవచ్చా? సేవిస్తే ఏం జరుగుతుంది అని. ఆమె అడిగిన ప్రశ్న ఎంత విలువైనదో, ముఖ్యమైనదో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. అందరికీ SHARE చేయండి..

కెఫీన్ ఉండటమే అసలు కారణం..

కూల్ డ్రింక్స్ లో బలాన్ని ఇచ్చే న్యూట్రియంట్స్ మోతాదు కన్నా శరీరానికి ఇబ్బంది కలిగించే కెఫీన్ అధిక మోతాదులో ఉంటుంది. అందుకనే ఆరోగ్య నిపుణులు గర్భంతో ఉన్న మహిళలకే కాకుండా అందరినీ కూడా కూల్ డ్రింక్స్ తీసుకోవద్దనే సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ లో కెఫీన్ వలన మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అలాగే ఎముకల బలాన్ని తగ్గించివేస్తుంది, నిద్రను దెబ్బతీస్తుంది మరియు కడుపులోని బిడ్డకు ఆరోగ్యకరం కాదు.

పిల్లల పుట్టుకలో కలిగే ఇబ్బందులు

మనం చూస్తూనే ఉన్నాం కదా ప్రజలను కూల్ డ్రింక్స్ పట్ల ఆకర్షితులను చేయడానికి కొన్ని కూల్ డ్రింక్స్ కంపెనీలు తమ సాఫ్ట్ డ్రింక్స్ లలో కొన్ని రకాల రంగులను, ఫ్లేవర్స్ ను కలుపుతూ ఉంటారు. ఇది కడుపులోని బిడ్డకు ఒక విధంగా ప్రమాదమే అని అంటున్నారు డాక్టర్స్. పుట్టుకతో కొంతమంది పిల్లలు అనారోగ్య  సమస్యలతో జన్మిస్తూ ఉంటారు. ఆ సమస్యలకు గర్భంతో ఉన్నప్పుడు తీసుకునే శీతల పానీయాలు కూడా ఒక కారణం అని చెబుతున్నారు.

బలం తక్కువ అనారోగ్యం ఎక్కువ

మీరు కూల్ డ్రింక్స్ యాడ్స్ టీవీలలో లేదా పేపర్స్ లలో చూస్తున్నప్పుడు కంటికి కనిపించని విధంగా చిన్న చిన్న అక్షరాలతో ఇందులో కెఫీన్ శాతం ఎక్కువగా ఉంటుందని నోట్ చేసి ఉంటారు. అంటే ఇందులో మనకు బలాన్ని ఇచ్చే శాతం ఎక్కువ, అనారోగ్యానికి గురిచేసేవి ఎక్కువ. కూల్ డ్రింక్స్  అతిగా సేవించడం వలన కడుపులోని పేగులు, గుండెల్లో మంటగా అనిపించడం, దంతాలలో మార్పులు వంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకని గర్భిణీ మహిళలు బిడ్డ జన్మించేవరకైనా వీటికి దూరంగా ఉండండి.

కూల్ డ్రింక్స్ కు బదులుగా ఇంటి దగ్గర లేదా బయట పండ్లతో  చేసుకునే జ్యూస్ లు తీసుకోండి. మీ బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దయచేసి ఈ విషయాన్ని అందరికీ SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon