Link copied!
Sign in / Sign up
23
Shares

పసి పిల్లలు బోర్లా పడుకుని నిద్రిస్తే ప్రమాదమా..!

ఇంట్లో పసి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, ఎటువంటి దుస్తులు వాళ్లకు వేస్తే వారి శరీరానికి మంచిది, ఎలా పడుకోబెట్టాలి, ఎన్ని నెలల నుండి వారికి ఆహారం ఇవ్వడం మొదలుపెట్టాలి.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి అమ్మనాన్నల బాధ్యత కూడా. అలాంటి వాటిలో పిల్లలు బోర్లా పడుకుని నిద్రించడం, ఇలా నిద్రించడం వలన పిల్లలకు ప్రమాదమా..! అసలు నిజం ఏంటో తెలుసుకోండి..

పిల్లలు కడుపుపై పడుకుని నిద్రిస్తే..

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. మీరు బాగా గమనించినట్లయితే వారు వీపు భాగాన కాకుండా పొట్ట కిందకు ఉంచి బోర్లా పడుకుని నిద్రిస్తూ ఉంటారు. ఇలా పడుకోవడం వలన పిల్లలకు చాలా ప్రమాదం. ఎందుకంటే బెడ్ కు దగ్గరగా వారి శ్వాసరంధ్రాలు ఉండటం  ఏదైతే ఆక్సిజన్ తీసుకున్నారో అదే ఆక్సిజన్ ను తిరిగి శ్వాసరంధ్రాల ద్వారా వదులుతారు. ఇలా జరగడం వలన అది కార్బన్ డై ఆక్సయిడ్ గా మారి పిల్లలకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి వారి ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది.

పిల్లలకు బోర్లా పడుకునే అలవాటు ఉంటే ఏం చేయాలి..!

పసిపిల్లలు ఇలా పడుకునే అలవాటు ఉంటే వెంటనే వారిని ముందు వైపుకు తిప్పి పడుకోబెట్టాలి. అంటే ముఖం ఆకాశం వైపు చూసే విధంగా పడుకోబెట్టాలి. కొన్నిసార్లు మళ్ళీ బోర్లాగే పడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వారు నిద్రలోకి జారుకోగానే వెంటనే వీపుపైకి మార్చడం చేయాలి. చాలామంది పిల్లలు పసితనంలోనే ప్రాణాలు వదిలి వేయడానికి ఇలా బోర్లా కడుపుపై పడుకోవడం కూడా ఒక కారణం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనదేశంలో ఇది కాస్త తక్కువగానే ఉన్నా విదేశాలలో ఈ సంఖ్య ఎక్కువని చెబుతున్నారు.

ఇంకే ఏయే ప్రమాదం ఉంటుంది..

పిల్లలు బోర్లా బెడ్ కు దగ్గరగా పడుకోవడం వలన కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కావడం ఒకటి పెద్ద సమస్య ఐతే, విడుదల చేస్తున్న గాలినే మళ్ళీ పీల్చుకోవడం వలన శరీరం వేడిగా మారుతుంది. చెస్ట్ లో నొప్పి కలగడం, ఊపిరితిత్తుల సమస్య, ఉన్నట్లుండి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారటం, ఇలా చాలా ఇబ్బందులను పసిపిల్లలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని మీ పిల్లలు పడుకునే విధానం పట్ల జాగ్రత్తగా ఉండండి. వారికి మంచి జీవితాన్ని ఇవ్వండి.

ఈ ఉపయోగకరమైన విషయాన్ని ప్రతి ఒక్కరికీ దయచేసి SHARE చేయండి.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon