Link copied!
Sign in / Sign up
34
Shares

శుక్రవారం రోజున మహిళలు ఈ 4 పనులు చేయకూడదు..

మనదేశంలో ప్రతి రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అందునా ముఖ్యంగా శుక్రవారం రోజున మరింత ఎక్కువ. ఈ రోజును మహిళలు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అమ్మవారికి పూజ చేయడం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి.  అయితే ఈ రోజున కొన్ని పనులు చేయకూడదని,అలాగే మరికొన్ని పనులు తప్పకుండా చేయాలని చెబుతున్నారు మన పెద్దలు. అవేంటో మీరే చూడండి.

డబ్బులు ఇవ్వటం

ఇది దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతిప్రాతమైన రోజుగా చెబుతారు కాబట్టి, ఈ రోజు ఇంట్లోని ధనాన్ని పక్కవారికి ఇవ్వటం వలన డబ్బు ధనలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే వ్యాపారం చేసేవారికి ఇది తప్పదు కాబట్టి వాళ్ళు ఇవ్వవచ్చు.

దుస్తులు

శుక్రవారం రోజున మాసిన బట్టలు, ముతక బట్టలు ధరించడం వలన అరిష్టమని, ఆ బట్టలు తాకడం కూడా చేయకూడని చెబుతారు. అందుకని ఈ రోజున మాసిన బట్టలను అస్సలు తాకకండి.

జుట్టు విషయంలో

శుక్రవారం నాడు మగవాళ్ళు గడ్డం చేసుకోవడం, జుట్టు కత్తిరించుకోకూడదని, కత్తిరించుకున్న ఇంట్లోకి రాకూడదని అంటారు. అలాగే మహిళలు కూడా తమ జుట్టు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.

నగలు

ఇంట్లో ఉన్న నగలను తాకట్టుపెట్టడం, ఎవరికైనా ఇవ్వడం చేయకూడదట. ఈ రోజున లక్ష్మీదేవి కటాక్షం అమ్మవారికి పూజలు  చేసే వారి ఇంట్లో ఉంటుందని అందుకని నగలు తాకట్టుపోవడం వద్దని అంటున్నారు. కావాలంటే మీరు ఈ రోజున నగలను కొనుగోలు చేయవచ్చు.

ఇలా చేయండి..

శుక్రవారం రోజున మీ ఇంటిని శుభ్రంగా చేసుకుని, తలంటుస్నానం చేసుకుని, పూజాగదిని శుభ్రం చేసి పూలతో అలంకరించుకుని శ్రద్ధగా పూజ చేయాలి. అమ్మాయిలు ఐతే ఓణీలు, పెద్దవాళ్ళైతే చీర ధరించి నుదుట పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున ఎవరైనా భోజనానికి పిలిచినా వెళ్లకుండా మీ ఇంట్లో భోజనం చేయడం ఉత్తమమని అంటున్నారు.

ఇంకా ఈ రోజు ఏం చేస్తే మంచిది, ఏం చేయకుండా ఉండాలో మీకు తెలిసి ఉంటే COMMENT చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon