Link copied!
Sign in / Sign up
11
Shares

మహిళలు శృంగారంలో మగవాళ్ల నుండి ఏం కోరుకుంటారు..?

దంపతుల మధ్య జరిగే అందమైన, ఆనందమైన ప్రక్రియ శృంగారంలో ఇలాగే ఉండాలి, ఆ విధంగా ఉండకూడదు అనే హద్దులు వారిద్దరి మధ్య మాత్రమే ఉంటాయి.  ఈ అందమైన ప్రక్రియలో ఎప్పుడు మగవారిదే పైచేయి అనుకుని వాళ్ళ ఇష్టం ప్రకారం  రతిలో ఆనందం పొందటం అనేది సరైన పధ్ధతి కాదు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే మహిళలు భర్త నుండి శృంగారంలో ఏం కోరుకుంటారో ఇక్కడ చూడండి..

ఈ వాసన అస్సలు నచ్చవు

కొంతమంది మగవారు శృంగారంలో పాల్గొనాలి అనే ఆవేశమో లేక ఆనందమో కానీ స్నానం చేయకుండా డైరెక్ట్ గా పడకగదిలో సుఖాన్ని కోరుకోవడం చేస్తుంటారు. ఇది మహిళలకు ఏ మాత్రం నచ్చదని నిపుణుల పరిశోధనలో తేలింది. శృంగారానికి ముందు మహిళలు శుభ్రంగా స్నానం చేసి అందంగా ఎలా ముస్తాబు అవుతారో తమ భాగస్వామి కూడా అలాగే ఉండాలని ఆశపడతారు. మగవారి స్నానం చేయకుండా అలాగే పాల్గొంటే వారి నుండి చమట దుర్వాసన వలన మహిళలు ఆనందం పొందలేరు.

వెంటనే వెళ్లిపోకూడదు

దంపతుల మధ్య శృంగారం జరుగుతున్నప్పుడు మగవారు స్కలనం జరగడం పూర్తవ్వగానే బెడ్ పై నుండి తన భార్యకు దూరంగా వెళ్లిపోవడం అస్సలు నచ్చదట. కొన్ని నిముషాల పాటు వారికి దగ్గరగా ఉంటూ వారితో సంతోషంగా గడపడం అంటే మహిళలకు చాలా ఇష్టమని, స్కలనం  జరగ్గానే వెంటనే వెళ్ళిపోతే వారికి ఆగ్రహం అని చెబుతున్నారు.

సైగలు అర్థం చేసుకోవాలి

రతిక్రీడలో మగవారు తమకు కావాల్సిన విధంగా అడగటం, కోరుకోవడం చేస్తుంటారు. ఇందులో ఎటువంటి ఇబ్బంది పడరని అంటుంటారు, కానీ మహిళలకు మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన విషయమట. ఏ విషయాన్ని నోరుతెరచి పడకగదిలో డైరెక్ట్ గా చెప్పలేరని చేతులతో లేదా కంటి చూపుతో చేసే సైగల ద్వారా మగవారు కనుక్కుని అర్థం చేసుకోవాలట. ఇలా అర్థం చేసుకోకపోతే మహిళలకు ఇష్టం ఉండదు, ఈ మాత్రం అర్థం చేసుకోలేరా అని మనసులో మదనపడతారట.

బలవంతం చేస్తే..

కొన్నిసార్లు ఆడవాళ్లు చెప్పే మాటలకు అర్థాలు వేరులే అని అంటుంటారు. కానీ ఈ విషయంలో ఆమె వద్దని గట్టిగా చెప్పినా, ఇష్టం లేకుండా చెప్పిన ఒంటరిగా వదిలివేయడం లేదా రతిక్రీడను పోస్ట్ పోన్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వారికి ఇష్టం లేకుండా బలవంతం చేస్తే దాంపత్య జీవితం అంటే శృంగారమేనా, శరీరం కోసమే ఇలా చేస్తారా అనే అపార్థమైన ఆలోచనలు వారి మదిలో వస్తాయట.

ఇది చాలా ముఖ్యం

పడకగదిలో ఆనందం అంటే ఏ ఒక్కరో సంతృప్తి పొందటమే కాదు.. దంపతులు ఇద్దరు ఆనందం పొందాలి, సంతోషంగా ఉండాలి. అందుకే మగవారు ఈ విషయంలో ఒకటి లేదా రెండుసార్లు ప్రేమగా అడిగి తెలుసుకోవాలి. ఇంకా ఏ విధంగా అయిన చేయాలా, నీకు సంతోషమేనా అని అడగాల్సిన బాధ్యత మగవారికి ఉంది. ఇందులో తప్పేమీ లేదు. మీ భాగస్వామి ఆనందమే మీరు కోరుకుంటున్నది అని గుర్తు పెట్టుకోండి..

ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ వీటిలో ఇవి చాలా ముఖ్యమైనవని అంటున్నారు. సో, వెంటనే SHARE చేయగలరు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon