Link copied!
Sign in / Sign up
3
Shares

శివరాత్రి రోజు తప్పక చేయాల్సిన 5 పనులు : ఇలా చేస్తే కోటిజన్మల పుణ్యఫలం

ముందుగా ‘టైనీ స్టెప్ తెలుగు’ ను ఆదరిస్తున్న మహిళలకు, దంపతులకు..పేరుపేరున మహా శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఈ పాటికే పూజా కార్యక్రమం ముగించి ఉంటారు. అయితే ఈ గొప్ప రోజున ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పుకునే పనులు చేయడం వలన శివానుగ్రహం మరియు కోటిజన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే చేయకూడని తప్పుల గురించి కూడా తెలుసుకోండి.

శివరాత్రి రోజు చేయాల్సిన పనులు

శివరాత్రి రోజు శివార్చన, ఉపవాసం, జాగరణ. ఇవి ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఉంటారు. శివార్చన తర్వాత ఉపవాసం ఉండటం, ఉపవాసం తర్వాత సూర్యాస్తమయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు నిద్రలేకుండా ఎటువంటి ఆహారం తీసుకోకుండా (పాలు, పండ్లు, జ్యూస్ తీసుకోవచ్చు) ఉంటారు. ఐతే ఈ జాగరణలో కొన్ని తప్పులు తెలియకుండా చేస్తుంటారు. వాటి గురించి తర్వాతి ఆర్టికల్ లో చెప్పుకుందాం. ఇప్పుడు ఈ రోజు చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం…

బిల్వపత్రం

పవిత్రమైన ఈ మహా శివరాత్రి రోజున శివాలయంలో లేదా ఇంట్లో శివుడి లింగం ముందు గానీ శివుడి చిత్ర పటం ముందు బిల్వపత్రం సమర్పించడం చేయాలి. ఇలా చేయడం వలన శివుడికి చాలా ఇష్టమట.

ఉపవాసం

ఉపవాసం చేయాలనుకునే శివనామస్మరణ చేస్తూ పాలు, పండ్లు, జ్యూస్, ఖర్జూరం పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం ఉండటం వలన శివానుగ్రహం లభిస్తుందని విశ్వాసం. గర్భిణీ మహిళలు, వృద్ధులు చేయాల్సిన అవసరం లేదు.

శివుడికి అభిషేకం

ఉపవాసం ఉన్న భక్తులు శివుడికి పాలు, తేనే, నెయ్యి, పంచదారలతో అభిషేకం చేస్తే శుభం కలుగుతుంది. శివుడికి అభిషేకం చేసిన తర్వాత కుంకుమతో తిలకం దిద్ది, పండ్లు, నైవేద్యం సమర్పించాలి.

ఈ పని చేయండి

శివుడికి ఎంతో ఇష్టమైన రోజు, పవిత్రమైన రోజు కాబట్టి పేదలకు, మీ ఇంటి దగ్గరికి వచ్చి సహాయం చేయమని కోరిన వారికి మీ చేతనైన సహాయం చేయండి. అన్నదానం చేయడం మంచిది. తప్పనిసరి అని కాదు మీకు తోచినంత వరకు మాత్రమే.

జాగరణ

జాగరణ చేసేవారు శివుడి నామస్మరణ చేస్తూ ఓం నమ:శివాయ అంటూ ధ్యానించడం లేదా శివుడి పాటలు, శివుడికి సంబందించిన సినిమాలు చూడటం చేయాలి. నిద్రమేలుకోవాలి కదా అని వినోదాన్ని అందించే సినిమాలు చూడటం, భక్తితో కాకుండా ఇంకేవిధమైన పనులు చేయడం బదులు నిద్రించడం ఉత్తమం.

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే అందరికీ SHARE చేయండి. మరొకసారి అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.. 

గమనిక : బెంగుళూరులో ఉన్న మహిళలకు శుభవార్త. మిమ్మల్ని, మీ పిల్లలని, మీ ఇంటిని, శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడానికి టైనీ స్టెప్ మీకోసం అందిస్తోంది సహజమైన పదార్థాలతో తయారు చేయబడిన కెమికల్స్ లేని ‘ఫ్లోర్ క్లీనర్’. క్రిములతో పాటు కెమికల్స్ కు దూరంగా ఉండండి. ఈ ఫ్లోర్ క్లీనర్ ను తక్కువ ధరకు పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon