Link copied!
Sign in / Sign up
20
Shares

శివరాత్రి రోజు ‘జాగరణ’ ఎందుకు చేయాలి? ఎవరికీ తెలియని అసలు కథ ఇదే..

శివరాత్రి.. లయకారకుడైన మహేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించిన పరమ పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యకు పూజ చేసి, ఉపవాసం ఉండి, జాగరణ చేస్తే శివుడి ముక్తి ప్రదాయం లభిస్తుందని, పరమశివుడి దయాకృప మనపై ఎల్లప్పటికీ ఉంటాయని భక్తుల నమ్మకం. శివరాత్రి పూజ, ఉపవాసం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఐతే జాగరణ చేయడం వెనుక ఉన్న అసలు కథ ఇదే… మీరు తెలుసుకున్న తర్వాత అందరికీ SHARE చేయండి.

శివరాత్రి రోజు ‘జాగరణ’ ఎందుకు చేస్తారు..!!

పరమ పవిత్రమైన శివరాత్రి పర్వదినాన లింగాకార రూపుడైన పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం తర్వాత నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు కునుకు తీయకుండా ఆ శివయ్య నామస్మరణలో ఉంటూ చేసేదే జాగరణ. కాగా ఈ జాగరణకు సంబంధించి చాలామందికి తెలియని ఒక కథ ఉంది. ఈ రోజు ఈ కథ గురించి తెలుసుకోవడం మీకు పుణ్యమే.

జాగరణ కథ ఇదే..

పూర్వం వారణాసిలో ఉండే సుస్వరుడు అనే బోయవాడు తన కుటుంబంతో కలిసి అడవిలో వెళ్తుండగా మధ్యలో దారి తప్పిపోతాడు. చీకటి పడటంతో మార్గమధ్యంలో కనిపించిన బిల్వవృక్షంపైకి ఎక్కి అక్కడే కూర్చుని తన భార్య, పిల్లల కోసం ఆకలితో ఎదురుచూస్తూ ఉంటాడు. ఆకలితో జాగారం చేస్తూ, ఏమీ తోచని స్థితిలో బిల్వ వృక్షం ఆకులను ఒక్కొక్కటిగా తుంచి కిందకు పడివేస్తూ ఉంటాడు. ఇలా కొమ్మనుండి కిందకు రాలిన ఆకులు చెట్టు కింద శివలింగంపై పడుతూ ఉంటాయి. భార్య పిల్లల కోసం ఎదురుచూస్తూ కన్నీటిని రాల్చగా ఆ కన్నీరు లింగంపై పడి అభిషేకం అయ్యింది. తెల్లవారిన తర్వాత తన ఇంటికి చేరుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత సుస్వరుడు కన్నుమూసి శివసాయుజ్యం చేరుకోవడం జరిగింది. బిల్వ ఆకులతో పూజ, కన్నీటితో అభిషేకం, రాత్రంతా ఆహారం తీసుకోకుండా జాగారం చేయడం, ఇలా శివరాత్రి గురించి అతడికి తెలియకపోయినా జరిగిన పుణ్యఫలం అని జాగరణ రహస్యం ఇదే అని చెబుతున్నారు పెద్దలు.

ఈ జాగరణ కథ గురించి చాలామందికి తెలియదు. కాబట్టి అందరికీ తెలిసేలా SHARE చేయండి.

గమనిక : బెంగుళూరులో ఉన్న మహిళలకు శుభవార్త. మిమ్మల్ని, మీ పిల్లలని, మీ ఇంటిని, శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడానికి టైనీ స్టెప్ మీకోసం అందిస్తోంది సహజమైన పదార్థాలతో తయారు చేయబడిన కెమికల్స్ లేని ‘ఫ్లోర్ క్లీనర్’. క్రిములతో పాటు కెమికల్స్ కు దూరంగా ఉండండి. ఈ ఫ్లోర్ క్లీనర్ ను తక్కువ ధరకు పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon