Link copied!
Sign in / Sign up
0
Shares

శివరాత్రి రోజు అభిషేకం నీటిలో ‘శివుడి’ దర్శనం : వైరల్ అయిన ఫోటోలు


నిన్న మహా శివరాత్రి వేడుకలను దేశమంతటా భక్తులు సంతోషంగా జరుపుకున్నారు. దేవుడి మహిమనో ఏమో గానీ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలోని సంజామలం మండలంలోని నొస్సం శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఇక్కడ భక్తులు చిన్న చిన్న శివలింగాలను పెట్టి అభిషేకం చేయగా ఆ అభిషేకం నీటిలో శివుడు దర్శనం ఇచ్చినట్లుగా కనిపించడంతో ఇది చూసేందుకు భక్తులు తండోపతండాలుగా అక్కడికి తరలివచ్చారు.

అభిషేకం నీటిలో శివలింగం

కర్నూల్ జిల్లా సంజామాల మండలంలోగల నొస్సం శివాలయంలో భక్తులు శివయ్యను దర్శించుకునేందుకు వచ్చి, అక్కడే తమతో పాటు తెచ్చుకున్న చిన్న శివలింగాలను ఒక చిన్న పాత్రలో పెట్టుకుని నీటితో అభిషేకం జరిపి ఆ తర్వాత పసుపు, కుంకుమలు రాశారు. కొన్ని నిముషాల తర్వాత శివుడి జఠాకార రూపంలో దర్శనం ఇవ్వడంతో ఆ గ్రామంలోని వారితో పాటు అందరికీ తెలిసింది.

పోటెత్తిన జనం

మహా శివరాత్రి పర్వదినాన జఠాకార రూపంలో పరమేశ్వరుడు దర్శనం ఇవ్వడంతో ఇది చూడటానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిషేకం నీటిలో కనిపించిన శివుడి రూపాన్ని చూసి భక్తితో దండాలు పెట్టుకున్నారు. ఐతే అభిషేకం నీటిలో పసుపు, కుంకుమ కలవడం వలన ఇలా ఏదో ఒక రూపం ఉంటుందని, శివరాత్రి కావడంతో అందరూ శివుడే అని అనుకుంటున్నారని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. 

గమనిక : బెంగుళూరులో ఉన్న మహిళలకు శుభవార్త. మిమ్మల్ని, మీ పిల్లలని, మీ ఇంటిని, శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడానికి టైనీ స్టెప్ మీకోసం అందిస్తోంది సహజమైన పదార్థాలతో తయారు చేయబడిన కెమికల్స్ లేని ‘ఫ్లోర్ క్లీనర్’. క్రిములతో పాటు కెమికల్స్ కు దూరంగా ఉండండి. ఈ ఫ్లోర్ క్లీనర్ ను తక్కువ ధరకు పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon