Link copied!
Sign in / Sign up
6
Shares

శివరాత్రి రోజు ఉపవాసం ఎలా చేస్తే మంచి జరుగుతుంది?

శివరాత్రి అనగానే శివార్చన, ఉపవాసం, జాగరణ ఈ మూడు ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చే పదాలు. శుభ్రంగా తలంటుకుని కొత్త బట్టలు ధరించి శివుడికి పూజ చేసి ప్రసాదాలు సమర్పించి, ఎటువంటి ఆహారం తీసుకోకుండా, రాత్రి నిద్రపోకుండా ఆ పరమేశ్వరుడి దగ్గరగా ఉండి భక్తితో స్మరించుకోవడం చేస్తుంటారు. ఐతే శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి? అని ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ వివరంగా తెలుసుకోండి…

ఉపవాసం ఎలా చేయాలి?

శివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండాలి అనుకున్నవారు ఉదయాన్నే నిద్రలేచి, ఇంటిని శుభ్రపరచుకుని, తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించి శివుడికి పూజ చేసి నైవేద్య ప్రసాదాలు పెట్టాలి. ఉపవాసం ఉండాలి అనుకునేవారు సముద్రపు ఉప్పు కాకుండా, సైన్ధవ లవణం, నల్లఉప్పు వాడమని చెబుతున్నారు. అన్నం వంటి ఆహారాన్ని తీసుకోవడం వలన దేవుడిపై భక్తి శ్రద్దల ఆలోచనలను నియంత్రించి వేస్తాయి, కాబట్టి పండ్లు పాలు తీసుకోమని చెబుతారు. అలాగే ఉపవాసం అంటే ఇబ్బంది పడేవారికి బీపీ, షుగర్ పేషేంట్స్, గర్భిణీలు, వృద్ధులు ఉపవాసం ఉండకపోవడమే మంచిది.

ఉపవాసం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉపవాసం అనగానే చాలామంది మహిళలు ఎటువంటి ఆహారం మరియు నీరు కూడా తాగకుండా ఉంటుంటారు. ఇలా చేయడం వలన నీరసం వచ్చి శరీరం బలహీనతవుతుంది కాబట్టి, ఇక్కడ చెప్పుకునే ఈ జాగ్రత్తలు ఉపవాసం ఉండేవారు తీసుకోవడం మంచిది.

1.ఉపవాసం మొదలు పెట్టే ముందు మరియు ఉపవాసం మధ్యలో అప్పుడప్పుడు నీటిని తాగడం చేయాలి.

2.నీరసం, అలసట లేకుండా ఖర్జూరాలు తింటూ ఉండాలి.

3.పాలు, పండ్లు, పండ్ల రసాలు తాగడం చేయాలి.

4.గ్రీన్ టీ, నిమ్మరసం తాగడం వలన ఆక్టివ్ గా ఉంటారు.

5.ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే మందులు వేసుకోవడం చేయాలి. ఉపవాసం కదా అని అలాగే ఉండకూడదు.

6.ఉపవాసం ఉండేవారు ఉదయం నిద్రపోవటం తప్పేమి కాదు. ఇలా నిద్రించడం వలన హుషారుగా ఉండగలరు.

7.ఉపవాసం చేసేవారు ఒకేచోట కుదురుగా కూర్చోవాలని ఎవ్వరూ చెప్పరు. కూర్చోవాలనిపిస్తే కూర్చోండి, నడుం వాల్చాలి అనిపిస్తే పడుకోండి. అటు ఇటు కొన్ని నిముషాలు బయట తిరగడం మంచిదే.

సో, పైన చెప్పుకున్న విధంగా శివరాత్రి రోజున ఇలా ఫాలో అవ్వండి. భక్తి శ్రద్ధలతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon