Link copied!
Sign in / Sign up
6
Shares

శరీరంలో ఉండే అనవసరమైన కొవ్వును తగ్గించడానికి 5 టిప్స్


ప్రసవం జరిగిన తర్వాత మహిళల శరీరం చాలా లావుగా, వదులుగా కనబడుతుంది. ఈ విషయం చాలా మంది మహిళలకు ఒక సమస్యగా మారుతుంది. మీ శరీరంలో ఎక్కువగా టాక్సిన్లు చేరడం వల్ల మీరు లావుగా కనిపిస్తారు. మీరు  బరువు తగ్గించుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే,

నిమ్మ

నిమ్మలో ఉండే సహజ లక్షణాల వల్ల మీ శరీరంలో ఉండే కొవ్వులు కరిగిపోతాయి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాస్ వాటర్‌లోకి నిమ్మరసం పిండి తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది.

చక్కెర

మీకు స్వీట్స్ తినే అలవాటు ఉంటే వెంటనే తగ్గించడం మంచిది. షుగర్ అనేది బరువు పెరిగే క్రమంలో ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. అందువల్ల మీరు చక్కెరను లేదా తీపు పధార్థాలను చాలా తక్కువగా తీసుకోవడం మంచిది.

వ్యాయామం

సరైన ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి. మీరు ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల నడుము భాగంలో ఉండే కొంత వరకు అదుపులో వస్తుంది. మీకు మంచి ఆకృతి కావలంటే, మీ వ్యాయామ డోసును పెంచాలి. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయాలి.

ఆహారం

బరువు తగ్గాలనుకునే వారు తాజా ఆహారాన్ని స్వీకరించడం మంచిది. ఎక్కువగా ఉడకబెట్టిన, ఏంచిన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్యాకేజ్డ్ ఫుడ్‌కు, నిల్వ ఉంచిన ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిల్వ ఉంచిన ఆహారం వల్ల శరీరంలో కొవ్వుల స్థాయి పెరుగుతుంది.

మూడు గంటలకొకసారి

మీరు ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం కన్నా వరుస విరామాలలో తీసుకోవడం మంచిది. దీని ద్వారా పొట్ట మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. రోజులో మూడు గంటలకు ఒకసారి చొప్పున ఆహారం తీసుకోవాలి. అయితే ఉదయం అల్పాహారం మాత్రం కాస్త ఎక్కువ తీసుకోవచ్చు.

ఈ విధంగా చేస్తూ మంచి ఆహారా నియమాలు పాటిస్తూ, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తే మీరు కచ్చితంగా బరువు తగ్గుతారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon