Link copied!
Sign in / Sign up
0
Shares

శరీర దుర్వాసనల వలన అనారోగ్య సమస్యలు వస్తాయా..! వెంటనే ఏం చేయాలో తెలుసుకోండి..

మానవ శరీరమే ఓ పెద్ద మిషన్. ఆ మిషన్ చేసినంత పని ఏ మిషన్ చేయలేదు అన్నది వాస్తవమే కదా. సాధారణంగా ఏ యంత్రం అయినా పని చేసినప్పుడు అనవసర వ్యర్థాలను బయటికి ఎలా పంపిస్తుందో.. మానవ శరీరం కూడా బాడీకి అవసరం లేని వ్యర్థాలను బయటికి పంపిస్తుంది.

అందులో భాగంగానే శరీరంలోనుంచి కొన్ని రకాల వాసనలు చర్మం ద్వారా బయటికి వెళ్తుంటాయి. ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉండి మంచి పరిశుభ్రమైన లైఫ్ స్టయిల్ ను లీడ్ చేస్తున్నా కూడా మీ శరీరంలో నుంచి కొన్ని రకాల వాసనలు వస్తున్నాయంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే.. మీ శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పుల వల్లనే ఇటువంటి వాసనలు బయటికి ఉద్గారమవుతాయనే విషయాన్ని మాత్రం మరవకండి.

సాధారణంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు శరీరం నుంచి చెడు వాసనలు వచ్చే మాట నిజమే. కాని.. ప్రతి సారి వచ్చే వాసనలు అనారోగ్య సమస్యల వల్లనే మాత్రం కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. మన శరీరం నుంచి బయటికి వచ్చే చెమట కూడా ఒక్కోసారి చెడు వాసనలను తీసుకొస్తుంది. మన శరీరంలో విడుదలయ్యే కొన్ని రకాల రసాయనాలు చెమటతో కలిసి ఇలా చెడు వాసనను బహిర్గతం చేస్తాయి.

చాలా మంది తమ శరీరం నుంచి చెడు వాసనలు వచ్చినప్పుడు డియోడరంట్స్, స్ప్రేలు వాడుతుంటారు. అయినప్పటికీ పర్ ఫ్యూమ్స్ ఎటువంటి సౌకర్యాన్ని ఇవ్వకపోతే డాక్టర్ ను సంప్రదించడం మేలు. చెడు వాసన అనేది ఒక్కోసారి పెద్ద పెద్ద జబ్బులకు దారి తీస్తుంది. అందుకే.. డెర్మటాలజిస్ట్ ను కలిసి జబ్బుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని దానికి ట్రీట్ మెంట్ తీసుకోవడం ఉత్తమం.

ఇక.. ఒక్కోసారి కొంతమందికి నోట్లో నుంచి, చంక నుంచి వాసన వస్తుంటుంది. అటువంటి సమయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఏదైనా జబ్బు లక్షణం అయి ఉండొచ్చు. బీరు, చెత్త, చేపల లాంటి వాసన వస్తే కనుక మీకు ఎల్లో ఫివర్, స్క్రోఫులా, షిజోఫ్రెనియా లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

అన్ని రకాల జబ్బులు వాసనలను ఉద్గారం చేయవు, కొన్ని రకాల జబ్బులు చెడు వాసనలను విడుదల చేయవు. డిఫ్తీరియా అనే వ్యాధి సువాసనను వెదజల్లుతుంది. ఒకవేళ మీ శరీరం నుంచి సువాసన వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. అది డిఫ్తీరియా అయి ఉండొచ్చు.

సాధారణంగా వేసవిలో కూడా కొన్ని రకాల వాసనలు విడుదలవుతుంటాయి. వేసవిలో ఎక్కువగా వచ్చే చెమటతోనే వాసన కూడా బయటకి విడుదలవుతుంది. నిజానికి వేసవిలో ఎక్కువగా చెడు వాసనే విడుదలవుతుంది. కాని.. అది ఎండ వేడికి అలా వస్తుంటుంది. దీన్ని చాలా మంది అంతగా పట్టించుకోరు. కాని.. ఒకవేళ చెడు వాసన ఎక్కువైతే మాత్రం డాక్టర్ ను ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. లేకపోతే అనవసర సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon