Link copied!
Sign in / Sign up
8
Shares

శనివారం రోజు మహిళలు ఏం చేయాలి? ఏం చేయకూడదో చూడండి..

జ్యోతిష్యశాస్త్రం, పురాణశాస్త్ర ప్రకారం గ్రహాలను ఫాలో అవుతున్నాం. ఈ నవగ్రహాలలో కొన్ని గ్రహాలను ఆయా రోజులకు అధిపతిగా చెప్పుకుంటున్నాం. అలా శనివారానికి శని అధిపతి అని అంటారు. ఒకసారి శని పట్టుకుంటే 7 ఏళ్ల వరకు విడిచిపెట్టదని మనం వింటూనే ఉంటాం. అయితే ఈ రోజున ఇక్కడ చెప్పుకునే ఈ పనులు చేయడం వలన మీకు నష్టం కలుగుతుందని, అలాగే ఈ ఒక్క పని చేయడం వలన మీకు ఆర్ధిక లాభం కలుగుతుందని అంటున్నారు పెద్దలు, శాస్త్రాలు ఫాలో అయ్యేవారు.  అవేంటో మీరే చూడండి.

ఉప్పు

సాధారణంగా ఉప్పును అప్పుగా తీసుకోవడం లేదా ఒకరి ఇంటి నుండి తీసుకోవడం చేయకూడదు, ఇవ్వకూడదు అని అంటారు. అయితే శనివారం రోజు మాత్రం ఉప్పును దానంగా ఇవ్వడం వలన ఆర్ధిక ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. అలాగే శనివారం రోజు ఉప్పు కొనవచ్చు కూడా.

దుస్తులు

ఏళ్లనాటి శని వెంటాడటం అని శని దేవుడికి కోపం కలిగించడం వలనే అని అంటారు. అందుకని మీరు ధరించే దుస్తులలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు నలుపు దుస్తులంటే ఎంత ఇష్టం ఉన్నా సరే ఈ రోజున అస్సలు ఆ దుస్తులు మీ ఒంటిపై పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే శనికి నలుపంటే పడదట. ఇలా చేయడం వలన ఇంకా కష్టాలు ఎక్కువవుతాయని అంటున్నారు.

చెక్కలు

కారణం ఏదైనా గానీ ఈ రోజు మాత్రం చెక్క పనులు గానీ చెక్కలతో చేసిన వాకిళ్లు, కుర్చీలు, డైనింగ్ టేబుల్ వంటిని కొనకూడదట. ఇలా చేయడం వలన మీకు ఆర్ధిక ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. సో, చెక్క వస్తువులు కొనడం వంటివి తర్వాత రోజులలో చేసుకోవడం మంచిది.

ఇవి చాలా డేంజర్

గ్రహాలు అంటే నమ్మకం, జాతకాలను ఫాలో అయ్యేవారికి ఇది బాగా తెలిసే ఉంటుంది. ఈ రోజున ఇనుప వస్తువులు, వంకాయలు మరియు నల్ల మిరియాలు కొనడం లేదా వాడినా శని వలన ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఆరోగ్య సంబంధం లేదా ఆర్ధికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. సో, కేర్ఫుల్ గా ఉండండి.

శని దోషం ఉన్నవారు

శని దోషంతో బాధపడేవారు ఈ రోజున శని స్తోత్రం మరియు వెంకటేశ్వర స్వామి, హనుమాన్ చాలీసా చదవటం మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే దగ్గరలో ఏదైనా గుడిలో నవగ్రహాలు ఉంటే వాటి చుట్టూ మూడు లేదా తొమ్మిది సార్లు తిరగాలని అంటున్నారు.

ఈ విషయాలు అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon