Link copied!
Sign in / Sign up
3
Shares

షాంపూ కోసం వెళ్లిన 15 ఏళ్ళ అమ్మాయిపై హత్యాచారం : 2 రోజుల తర్వాత నిజం చెప్పిన మైనర్ బాలిక

15 ఏళ్ళ అమ్మాయి, తన స్నేహితులతో కలిసి సరదాగా హోళీని చేసుకుంది. తనపై, తల జుట్టుపై రంగులు ఎక్కువగా ఉండటంతో తలస్నానం చేయాలనుకుంది. ఇంట్లో షాంపు లేకపోవడంతో ఇంటికి దగ్గర్లోని షాపుకు వెళ్లి షాంపు అడిగింది. షాపులో పనిచేసే అతను కొన్ని చూపించగా, వేరేవి కావాలని అడిగింది ఆ అమ్మాయి. పైన గదిలో (ఫస్ట్ ఫ్లోర్ లో) కొత్త బ్రాండ్స్ ఉన్నాయ్, అక్కడికి వచ్చి తీసుకోమని ఆ అమ్మాయిని పైకి తీసుకెళ్లాడు. అతడిని గుడ్డిగా నమ్మి వెళ్లిన ఆ అమ్మాయిపై హత్యాచారం చేశాడు.

షాంపూ కావాలని వెళ్లిన అమ్మాయిపై..

రంగులతో హోళీని సంతోషంగా జరుపుకున్న ఆ మైనర్ బాలికకు ఇకపై ఆ అమ్మాయి జీవితంలో సంతోషం లేకుండా నమ్మించి మోసం చేశాడు ఈ దుర్మార్గుడు. ఈ అమ్మాయి కుటుంబానికి, ఆ షాపు వాళ్ళు స్నేహితులు కావడంతో ఎప్పుడు అదే షాపుకు వెళ్లేవారు. అక్కడ పనిచేసే షాప్ కీపర్ ఆ అమ్మాయిని ఫస్ట్ ఫ్లోర్ కొత్త షాంపూ బ్రాండ్స్ ఉన్నాయని చెప్పి తీసుకెళ్లాడు. పై గదిలో రూమ్ లోకి తీసుకెళ్లి 15 ఏళ్ళ మైనర్ బాలికపై హత్యాచారం చేశాడు.

2 రోజుల తర్వాత అమ్మతో ఏడుస్తూ చెప్పింది…

హోళీ రోజు తన జీవితంలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటనను ఇంట్లో ఎవరితో చెప్పకుండా భయంతో ఏడుస్తూ తన గదిలో ఒంటరిగా కూర్చుంది. ఏమైందని అమ్మనాన్నలు అడిగినా చెప్పలేదు. నిన్న ఆదివారం రోజు అమ్మ ముందు ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది. ఈ దారుణానికి పాల్పడిన ఇతడి పేరు అనిల్ శర్మ. వెంటనే ఈ అమ్మాయి తండ్రి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు.

ఇతడికి ఒక కూతురు కూడా ఉంది..

15 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యంత దారుణంగా హత్యాచారానికి పాల్పిడిన ఇతడికి ఇప్పటికే పెళ్లి అయ్యి ఒక కూతురు కూడా ఉంది. ఐపిసి సెక్షన్ 376 యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని రాంచీ సర్దార్ హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

అభం శుభం తెలియని ఇటువంటి అమాయక పిల్లలకు ఇక సేఫ్టీ ఎక్కడ దొరుకుతుందో ప్రభుత్వాలే చెప్పాలి.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon