Link copied!
Sign in / Sign up
7
Shares

సెక్స్ తర్వాత యోనితో తప్పకుండా చేయాల్సిన 5 పనులు : లేకపోతే ప్రమాదకర వ్యాధులు వస్తాయి

మగవారితో పోల్చితే మహిళల శరీరంలో శృంగారం తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల కారణంగా మహిళలలో కొన్ని వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అయితే శృంగారంలో పాల్గొన్న తర్వాత స్త్రీలు యోనితో తప్పకుండా ఈ పనులు చేయడం వలన మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. అవేంటో మీరే తెలుసుకోండి.

యోనిని ఇలా శుభ్రం చేసుకోండి

శృంగారం జరిగిన తర్వాత పురుష వీర్యం మహిళల యోనిపై పడటం, కొన్నిసార్లు యోని చుట్టూ కింద పడిపోవడం జరుగుతుంది. దీని వలన అక్కడ ఇన్ఫెక్షన్స్ మొదలై మంటను కలిగిస్తాయి. ఆ సమయంలో మీరు చేతులను అక్కడ పెట్టడం, చేతులను శుభ్రం చేసుకోకపోతే అవి మీ నోటిలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అందుకే సెక్స్ జరిగిన తర్వాత యోని చుట్టూ సబ్బుతో క్లీన్స్ చేసుకుని పొడి టవల్ తో తుడుచుకోవాలి. యోనిలో అవసరం లేదు. యోని లోపల అదే శుభ్రం చేసుకోగలదు.

ఆయిల్ రాసుకుని గోరువెచ్చని నీటితో

సెక్స్ లో పాల్గొన్న తర్వాత శరీరం కాస్త నీరసంగా ఉంటుంది కాబట్టి శరీరంపై కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసుకుని గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే ఉల్లాసంగా ఉంటారు. ఇలా చేయడం యోని చుట్టూ ఇన్ఫెక్షన్స్ కూడా దరిచేరవు.

వదులుగా ఉండే లో దుస్తులు

సెక్స్ సమయంలో ధరించిన బట్టలను వెంటనే నీటిలో నానబెట్టాలి. పడకగదిలోనే ఉంచడం వలన అక్కడ బాక్టీరియా ఎక్కువ చేరుతుంది. అలాగే శృంగారం తర్వాత బిగుతైన దుస్తులు ధరించడం వలన యోనికి సరైన గాలి తగలదు, వేడి ఎక్కువగా కలిగి మీకు నిద్రపట్టకుండా చేస్తుంది. అందుకే వీలైనంత వరకు వదులైన దుస్తులు ధరిస్తే మంచిది.

నీరు ఎంత తీసుకోవాలి?

రతి క్రీడకు ముందు రతి క్రీడ తర్వాత నీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. రతి క్రీడకు ముందు ఎక్కువ శక్తి కావాలి కాబట్టి ఎక్కువ నీరు తాగాలి. అలాగే శృంగారం తర్వాత డీ హైడ్రేషన్ లేకుండా ఉండాలన్నా నీరసం తగ్గడానికి ఎక్కువ నీటిని సేవించాలి.

మల మూత్ర విసర్జన ఆపుకోకూడదు

శృంగారంలో పాలొన్న తర్వాత చాలామంది ఒకరినొకరు దగ్గరగా ఉంటూ అలానే పడుకోవడం వలన హాయిగా ఉండవచ్చు కానీ శృంగారం తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేయాలి.. ఎందుకంటే మగ, ఆడ ఇద్దరిలోనూ ఉన్న బాక్టీరియా త్వరగా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. సుఖ వ్యాధులకు ఇది కూడా ఒక కారణం.

గాలి తగిలేలా చూసుకోవాలి

మహిళలు తమ యోని పట్ల శృంగారంలో పాల్గొన్న తర్వాత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. యోని చుట్టూ శుభ్రం చేసుకున్న తర్వాత పొడి టవల్ తో తుడుచుకోవడం, ఇంకా తడిదనం ఉంటే బ్లోయర్ తో ఆరిపోయే వరకు చూసుకుంటే యోనికి మంచిది.

ఈ విషయాల పట్ల ఖచ్చితంగా ప్రతి మహిళకు అవగాహను ఉండాలి. అందుకే మర్చిపోకుండా SHARE చేయండి. ఎందుకంటే మీ శరీరం బాగుంటూనే కదా మీరు ఉల్లాసంగా ఉండగలరు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon