Link copied!
Sign in / Sign up
2
Shares

సెక్స్ తరువాత మీ యోనితో ఈ 5 పనులు చేయకూడదు


సెక్స్ జరిగే సమయంలో, దేని గురించి ఆలోచన ఉండదు. అంతా పూర్తయ్యాక ఆ సంతృప్తిలో ఏమి చేస్తామో తెలీదు. కానీ తప్పకుండా సెక్స్ తరువాత మీరు చేసే కొన్ని పనులు, మీ మీద ప్రభావం చూపిస్తాయి. సెక్స్ తరువాత ముఖ్యంగా యోనితో మీరు కొన్ని పనులు చేయకూడదు. ఆ చేయకూడని పనులు ఏంటో ఇక్కడ తెలుసుకోండి…

1. టిష్యూస్ తో రుద్దదు

సెక్స్ జరిగిన వెంటనే, కొంతమంది టిష్యూస్ తో యోనిని శుభ్రపరచడానికి, గట్టిగా రుద్దుతారు. అలా చేయకండి. సెక్స్ సమయంలో పురుషాంగం, మీ యోనిలోకి ప్రవేశించడం వలన కొంత బాక్టీరియా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు యోని పై టిష్యూతో రుద్దినప్పుడు, అవి ఇంకా లోపలి వెళ్ళుతాయి.

2. సబ్బుతో కడగవద్దు

సెక్స్ జరిగిన తరువాత అందరు చేసే ఇంకో పని, సబ్బుతో యోనిని కడగడం. సెక్స్ తరువాత ఇలా చేయడం వలన యోని కి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి ఎక్కువగా సబ్బును యోని ప్రాంతంలో వాడద్దు.

3. వేడి నీళ్ళు

సెక్స్ తరువాత యోని భాగాన్ని శుభ్రం చేయడానికి, ఎక్కువగా వేడి నీళ్ళు వాడకూడదు. అలా చేయడం వలన యోని లోని లూబ్రికేషన్ తగ్గిపోతుంది. యోని పొడిబారిపోతుంది.

4. చేతితో తుడుచుకోవద్దు

సెక్స్ తరువాత యోని నుండి వచ్చే ద్రవాలను చేతితో తుడిచేయకండి. చేతులలో ఉండే క్రిములు యోని లోకి ప్రవేశిస్తాయి.

5. బిగుతైన బట్టలు వద్దు

సెక్స్ పూర్తయిన తరువాత, మీ ఇన్నర్ వేర్ ను అలాగే ఉంచుకుని నిద్రపోకండి. బిగుతుగా ఉండడం వలన, యోని ఇన్ఫెక్షన్ లు వస్తాయి

సెక్స్ జరిగిన తరువాత, ఏదైనా మెత్తటి కాటన్ క్లాత్ తో, యోని తుడుచుకోవచ్చు, లేదా చల్లని నీటితో కడుక్కోండి సరిపోతుంది.

అందరికి తప్పకుండా SHARE చేయండి

ఇవి కూడా చదవండి

వెజైనా (యోని) బిగువుగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి

యోని గురించి అందరికి తెలియని 5 రహస్యాలు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon