Link copied!
Sign in / Sign up
8
Shares

సెక్స్ సమయంలో పురుషాంగం నుండి వచ్చే ప్రీ-కమ్ వలన మీరు ప్రేగ్నన్ట్ అవుతారా?

చాలా మంది ఏ రక్షణ లేకుండా సెక్స్ చేస్తారు. స్కలనం యోని లోపల జరగనంత వరకు గర్భం రాదనుకుంటారు. కానీ స్కలనానికి ముందు, పురుషాంగం నుండి వచ్చే ప్రీ కమ్ మిమ్మల్ని ప్రేగ్నన్ట్ చేయగలదు.

ప్రీ కమ్ అంటే ఏంటి?
 

శృంగార సమయంలో పురుషులు ఉద్రేకం చెందిన తరువాత, స్కలనం జరగడానికి ముందు, పురుషాంగం నుంచి ఒక  పల్చటి ద్రవం వస్తుంది. దీనినే ప్రీ కమ్(Pre cum) అంటారు.

ప్రీ కమ్ వలన ప్రెగ్నన్సీ వస్తుందా?
 Related image

దీనికి సమాధానం అవుననే చెప్పాలి. సహజంగా ప్రీ-కమ్, వీర్యంలా చిక్కగా ఉండదు. ప్రీ కమ్ లో వీర్య కణాలు కూడా ఉండవు. కానీ పురుషాంగం నుండి వీర్యం వచ్చే మార్గంలోనే ప్రీ కమ్ కూడా బయటకు వస్తుంది. ఇంతక ముందు వీర్యం వచ్చినప్పుడు, ఏవైనా వీర్య కణాలు ఆ మార్గంలో ఉండి పోతే, అవి ప్రీ కమ్ ద్వారా మీ యోనిలోకి ప్రవేశించవచ్చు. మీరు ప్రేగ్నన్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

అందుకే మీరు ప్రెగ్నన్సీ వద్దనుకుంటే, సెక్స్ సమయంలో ఏదైనా రక్షణ వాడడం మంచిది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon