Link copied!
Sign in / Sign up
4
Shares

సెక్స్ సమయంలో ఎలాంటి వాసనలు వస్తాయి? దేనికి సంకేతాలు

దంపతులు శృంగారంలో పాల్గొంటున్నప్పుడు తమ శరీర దుర్వాసన కాకుండా వేరే దుర్వాసనలు వస్తూ ఉంటాయి. ఈ దుర్వాసనల కారణంగా సెక్స్ లో ఆనందాన్ని పొందలేరు. అసలు శృంగారంలో వాసనలు ఎందుకు వస్తాయి? ఎలాంటి వాసనలు వస్తాయి. సెక్స్ సమయంలో వాసనల వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకోండి.

యోని ఇన్ఫెక్షన్స్

దంపతుల మధ్య శృంగారం ఎక్కడలేని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే సెక్స్ సమయంలో దుర్వాసన రావడం వలన సెక్స్ పై ఆసక్తి తగ్గిపోతుంది. కొన్నిసార్లు మగ, ఆడ ఇద్దరిలోనూ ఈ సమస్య ఉంటే కొన్నిసార్లు మగవారిలోనే ఈ ఇబ్బంది అధికంగా ఉంటుంది. ఎందుకంటే యోని ఇన్ఫెక్షన్స్ ఇందుకు కారణం. అక్కడ చేరుకున్న బాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్స్ చేరి భరించలేని దుర్వాసనను కలిగిస్తాయి. ఇది నిర్లక్ష్యం చేస్తే మహిళల ఆరోగ్యంపైనే ప్రభావం చూపుతుంది.

ఋతుక్రమం సరిగ్గా జరగనప్పుడు

కొందరి మహిళలలో నెలసరి సరిగ్గా జరగకుండా నెలకు రెండుసార్లు అవ్వడం, సరైన సమయానికి కాకుండా నెల మధ్యలోనే లేక నెలసరి జరిగిన కొన్ని రోజులకే జరిగినప్పుడు శృంగారంలో పాల్గొనడం వలన భరించలేని దుర్వాసన వస్తుంది. అప్పుడు శృంగారం చేయకపోవడమే మంచిది. లేకపోతే దంపతులకు ఇద్దరికీ సుఖవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

యోని - పురుషాంగం శుభ్రంగా లేకపోవడం

యోని సాధారణంగా తనని తానే శుభ్రపరచుకోలగలదు. ఐతే యోని చుట్టూ ఎప్పటికప్పుడు బాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్స్ కు కారణమై యోని నుండి దుర్వాసనను కలిగిస్తుంది. అలాగే మగవారు తమ పురుషాంగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే పురుషాంగం మహిళల యోనిలోకి ప్రవేశించినప్పుడు ఈ బాక్టీరియా వారి శరీరంలోకి కొత్త సమస్యలను తెస్తాయి.

Ph లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు

హార్మోన్ల అసమతుల్యత, సెక్స్ కు ముందు తీసుకున్న కొన్ని ఆహార పదార్థాలు కారణంగా, మహిళల శరీరంలో Ph లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు సెక్స్ సమయంలో వాసన బయటకు వస్తుంది. ఇద్దరి మర్మాంగాలు శుభ్రంగా లేకపోవడం ఇందుకు కారణం.

కండోమ్స్ ఉపయోగించినప్పుడు

ప్రస్తుతం మార్కెట్ లో కొన్ని నాసిరకం కండోమ్స్ దొరుకుతున్నాయి. వాటిలో కొన్ని కెమికల్స్ యాడ్ చేయడం వలన సెక్స్ సమయంలో దుర్వాసనను కలిగిస్తాయి. అలాగే ఇవి సరిగ్గా లేకపోవడం వలన మీ ఇద్దరి మర్మాంగాలకు ప్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంది.

వీర్యం బయటకు వచ్చినప్పుడు

సాధారణంగా పురుష వీర్యకణాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతుంటాయి. రోజుకి వేల సంఖ్యలో పుడుతూ ఉంటాయి. అలా కాకుండా పురుష వీర్యకణాలు నిల్వ ఉండి, ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు దుర్వాసనను కలిగిస్తాయి.

సెక్స్ సమయంలో ఒకటి రెండుసార్లు సాధారణంగా వాసన వస్తుంటే విచారించాల్సిన అవసరం లేదు కానీ తరచూ ఈ విధంగా జరుగుతుంటే వెంటనే వైద్యుడిని కలిసి సలహా తీసుకోవడం మంచిది.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి. అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.

ఇవి కూడా చదవండి. 

భర్త నుండి భార్య కోరుకునే 10 రొమాంటిక్ పనులు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon