Link copied!
Sign in / Sign up
19
Shares

శృంగార శక్తిని పెంచే 6 ఆహారాలు


మీ సెక్స్ జీవితం ఆనందమయం చేయడంలో, మీరు తీసుకునే ఆహారం పాత్ర చాలా ఉంది. కానీ ఎలాంటి ఆహారాలు, మీ సెక్స్ కోరికలను, సామర్ధ్యాన్ని పెంచుతాయో తెలుసా? అవేవో మీకు దొరకని ఆహారాలు కాదు. మనం రోజు చూసేవే, తినేవే. అవేంటో చూడండి...

1. డార్క్ చాక్లేట్

డార్క్ చాక్లేట్ తినడం వలన, మెదడులో సెక్స్ కోరికలను పెంచే సెరోటోనిన్, డోపామైన్ పెరుగుతాయి. అంతేకాకుండా చాక్లెట్ లో ఉండే కోకోవా, రక్తనాళాల్లో రక్త ప్రసరణను పెంచుతుంది. దీని వలన  సెక్స్ లో ఉద్రేకంగా పాల్గొంటారు.

2. గ్రీన్ టీ

గ్రీన్ ఆరోగ్యానికే కాదు, సెక్స్ కూడా అవసరం. గ్రీన్ టీ లో ఉండే కాటెచిన్స్ (Catechins) అనే పదార్ధం, రక్త ప్రసరణను పెంచి, ఉద్రేకాన్ని కలిగిస్తుంది.

3. అల్లం

అల్లం మీ ఆహారంలోనే కాదు, మీ సెక్స్ జీవితంలో కూడా కొంత ఘాటును కలుపుతుంది. అల్లం మీ ఆర్టెరీస్ లో రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది. దాని వలన సెక్స్ కోరికలు పెరుగుతాయి.

4. గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడికాయ విత్తనాలలో ట్రీప్టోఫాన్ (tryptophan) అనే పదార్ధం ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వలన సెక్స్ కోరికలు అధికం అవుతాయి.

5. అరటిపండు

మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు  అధికంగా ఉంటే, మీ సెక్స్ అవయువాలలో రక్త ప్రసరణ మందగిస్తుంది. దీనికి పరిష్కారం అరటిపండ్లు తినడం. అరటిపండ్లలో అధికంగా ఉండే పొటాషియం, సెక్స్ అవయువాలలో రక్త ప్రసరణను సరి చేస్తుంది. 

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon