Link copied!
Sign in / Sign up
25
Shares

పిల్లలు ఇష్టంగా తినే ‘సేమియా పాయసం’ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి..?

తెలుగువాళ్లు ఎక్కువగా సేమియా పాయసాన్ని పండుగలు లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటూ ఉంటారు. మాములు సమయాలలో  కూడా సేమియా పాయసాన్ని తీసుకోవడం వలన శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చి ఉత్తేజాన్ని అందిస్తుంది.  అందరూ ఇష్టపడేలా రుచికరంగా సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు :

సేమియా - ఒక కప్పు

చక్కర - అర కప్పు

పాలు -2 కప్పులు

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

యాలకులు - 2

ఎండు ద్రాక్ష - 2 టేబుల్ స్పూన్లు

జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు

సేమియా పాయసం తయారీ విధానం :

1.ముందుగా పాన్ తీసుకుని వేడి అయిన తర్వాత అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి, అందులో జీడిపప్పు మరియు ఎండు ద్రాక్షలు వేసి కాస్త రంగు మారేవరకు వేడిచేయాలి. వీటిని ఒక కప్పులో పక్కన పెట్టుకోవాలి.

2.అదే పాన్ లో కాస్త నెయ్యి వేసుకుని కప్పు సేమియాను వేసి వేడిచేయాలి. ఎర్రటి రంగులోకి మారటానికి 3 నిముషాలు పడుతుంది. ఆ తర్వాత అందులో రెండు కప్పుల నీటిని వేసి 5 నిముషాలకు పైగా మరిగించాలి.

3.ఇలా మరుగుతున్న సేమియాలో ఒక పాలు కలిపి మళ్ళీ ఓ 10 నిముషాల పాటు వేడి మరిగించాలి.

4. పాలు కలిపిన తర్వాత చక్కరను వేసి బాగా కలపాలి.

5.ఇక చివరగా యాలకులు, ఎండుద్రాక్ష మరియు జీడిపప్పు వేసి మిక్స్ చేసినట్లయితే మీకు ఇష్టమైన సేమియా  పాయసం రెడీ అయినట్లే.

మీ ఫ్యామిలీ మెంబర్స్ కు సేమియా పాయసాన్ని ఇష్టంగా తింటారు. మరిన్ని వంటకాల గురించి తెలుసుకోవాలంటే COMMENT చేయండి. సేమియా పాయసం తయారీ విధానం మీకు నచ్చితే SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon