Link copied!
Sign in / Sign up
0
Shares

స్కూటీలో వెళ్తున్న గర్భిణీ మహిళను వెంబడించిన పోలీస్ : ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ

3 నెలల గర్భిణీ, తన భర్తతో కలిసి స్కూటీపై వెళ్తోంది. వాళ్ళు వెళ్తున్న దారిలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేని వారిని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలను నిలపడం చేస్తున్నారు. ఈ దంపతులను ఆపాలని పోలీసులు అడగగా, హెల్మెట్స్ లేకపోవడంతో ఆపకుండా వెళ్లిపోయారు. ఆపకుండా వెళ్లడంతో వారి బండిని వెంబడించారు పోలీసులు. ఈ ప్రమాదంలో 3 నెలల గర్భణి తన ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది.

అసలేం జరిగింది..!

తమిళనాడులోని తిరుచ్చి హైవేపై గణేష్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్నారు. సూలాపేటకు చెందిన దంపతులు రాజా, ఉష బైక్ పై హెల్మెట్ లేకుండా వెళ్తుండడంతో బండి సైడ్ పెట్టమని అన్నారు. ఈ దంపతులు బండి ఆపకుండా అలాగే వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు వారి వెహికల్ ను తమ వాహనంతో వెంబడించారు. ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ వారి వాహనానికి వీళ్ళ బండిని మరియు ఆమెను కాలితో తన్నటంతో ఒక్కసారిగా ఆ దంపతులు కిందపడిపోయారు. ఆమె కిందపడిపోవడంతో బాగా గాయలయ్యి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

3000 మంది అండగా నిలిచారు

3 నెలల గర్భిణీ ప్రాణాలు పోలీసుల క్షణికావేశంలో పోవడంతో తిరుచ్చి హైవేపై దాదాపు 3 వేల మందితో ఆందోళనకు దిగారు. ఉష భర్త రాజా స్వల్ప గాయాలతో ఈ ఘటన నుండి బయటపడ్డారు. ఉష ప్రాణలు పోవడానికి ట్రాఫిక్ పోలీసులే కారణమనే ఆగ్రహంతో అక్కడి స్థానికులు పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి చేయి దాటి పోవడంతో పోలీసులు దీనికి అంతటికి కారణమైన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ను అరెస్ట్ చేశారు.

నిండు గర్భిణి, తమ కుటుంబంలో ఒక బిడ్డ రాబోతున్నాడు అని ఆనందపడుతున్న సమయంలో వారి ఇంట్లో విషాదం మిగిలింది. డబ్బులు ఎగ్గొడుతున్న ఎంతోమందిపై చర్యలు తీసుకోకుండా సామాన్యులపై మీరు చేస్తున్న తీరు బాగోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon