Link copied!
Sign in / Sign up
2
Shares

స్కూల్ ఫీజు కట్టలేదని 4 ఏళ్ళ చిన్నారిని చితకబాదిన టీచర్ : వీపు, కాళ్లపై దద్దులు

పాఠాలు నేర్పించాల్సిన టీచర్లు ప్రాణాలు పోయేలా కొట్టారు, విద్యాబుద్ధులతో ముందుకు నడిపించాల్సిన గురువులే వీపు, కాళ్ళు దద్దులు వచ్చేలా కొట్టారు. అయ్యో పాపం అనిపించేలా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.  4 ఏళ్ళ ఈ చిన్నారి స్కూల్ ఫీజు కట్టలేదని ఎలా కొట్టారో చూడండి. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళితే..

స్కూల్ ఫీజు కట్టలేదని..

రంగారెడ్డి జిల్లాలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల నందనవనం కాలనీలో ఉన్న కృష్ణవేణి హైస్కూల్ లో నిఖిల్ అనే ఈ చిన్నారి నర్సరీ చదువుతున్నాడు. స్కూల్ ఫీజు సరైన టైంలో కట్టలేదని పెద్ద కర్రతో టీచర్, ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ ఇష్టం వచ్చినట్లుగా పసివాడు అని కూడా చూడకుండా ఇలా కొట్టారు. వీపు, కాళ్లపై దద్దులు వాతలు కనబడుతూ రక్తం వస్తోంది. తమ పిల్లాడిని ఇలా చిత్రహింసలకు గురిచేసిన టీచర్, ప్రిన్సిపాల్, డైరెక్టర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని స్కూల్ ముందు పిల్లాడి పేరెంట్స్ తో పాటు వారి బంధువులు మరియు మిగతా విద్యార్థుల పేరెంట్స్ ధర్నా చేశారు.

అరెస్ట్ చేసిన పోలీసులు

తమ చిన్నారిపై ఇలా అమానుషంగా దాడి చేయడంతో చిన్నారి తల్లితండ్రులు బాలల హక్కుల సంఘం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా టీచర్, ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ ను అరెస్ట్ చేసారు. ఈ పిల్లాడి తండ్రి ప్లంబర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. టీచర్ కొట్టిందని గట్టిగా అరిచి చెప్పలేక ఇదిగో ఇలా తన కాళ్ళు, వీపుపై పడ్డ వాతలను, దద్దుర్లను చూపించాడు. పిల్లలను ఇలా హింసిస్తున్న ఇటువంటి స్కూల్స్ ను వెంటనే మూసివేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.

స్కూల్ ఫీజు కట్టకపోతే పేరెంట్స్ కు కబురుపెట్టి అడగాలి గానీ ఇలా అభం శుభం తెలియని చిన్నారులను హింసించడం ఎంతవరకు సమంజసం..? 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon