Link copied!
Sign in / Sign up
24
Shares

సాయంత్రం పిల్లలు చాలా ఇష్టంగా తినే 10 బెస్ట్ స్నాక్స్…

చాలామంది పిల్లలు భోజనం కాకుండా చిరుతిండ్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. స్కూల్ కు వెళ్తున్న పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక అలసిపోయి బాగా ఆకలితో ఉంటారు. కాబట్టి పిల్లలకు ఇక్కడ చెప్పుకునే ఆహారాలను ఇవ్వడం వలన వారికి ఆరోగ్యకరం మరియు త్వరగా జీర్ణం అయ్యి ఆకలిని పెంచుతాయి కూడా.  పిల్లలు ఇష్టంగా తినే ఆ స్నాక్స్ ఏంటో మీరే చూడండి..

అరటిపళ్ళు

అరటిపండు తినడం అందరికీ ఇష్టమే. పండుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా అరటిపండును కట్ చేసి లేదా డిఫరెంట్ గా కట్ చేసి ఇవ్వడం వలన ఇష్టంగా తింటారు. మీ పిల్లలు స్కూల్ కు వెళ్ళేటప్పుడు కూడా స్నాక్స్ బాక్స్ లో వీటిని ఉంచవచ్చు.

ఆపిల్

పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లలో ఆపిల్ ఒకటి. ఆపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తే పిల్లలు బాగా తింటారు. కొంతమంది పిల్లలు ఎప్పుడు ఇదేనా అని మారాం చేస్తుంటారు. అటువంటప్పుడు మీరు కూడా వారితోపాటు తినడం వలన ఇష్టంగా తింటారు. అలాగే క్యారెట్ డైరెక్ట్ గా లేదా ఉడకబెట్టి ఇవ్వడం మంచిదే.

డేట్స్ మిల్క్ షేక్

పిల్లలు ఇష్టంగా తినే స్నాక్స్ లో ఇది ఒకటి. తక్కువ మొత్తం తీసుకున్నా చాలు ఎక్కువ శక్తిని ఇస్తుంది. పిల్లలకు మంచి ఆరోగ్యకరం కూడా. రుచికరమైన ఈ స్నాక్స్ ఎలా చేయాలో మరొక ఆర్టికల్ లో వివరంగా చెప్పుకుందాం..

వెజ్ నూడిల్స్ సాస్ లేకుండా..

మొక్కజొన్న, మూంగ్ దాల్, క్యారెట్, టమోటో, బీన్స్..ఇలా కొన్ని వెజిటేబుల్స్ తీసుకుని అందులో ఎక్కువ మసాలా మరియు సాస్ లేకుండా చేసి పిల్లల ముందు ఉంచితే ఆ ఘుమఘుమలకే ఎంతో ఇష్టంగా తింటారు. ఇది కూడా త్వరగా జీర్ణమయ్యే ఆహారమే.

ఆపిల్ మిల్క్ షేక్

ఇది బ్రేక్ ఫాస్ట్ గా మరియు స్నాక్స్ గా ఇవ్వవచ్చు. ఒక ఆపిల్, మిల్క్ షేక్ క్రీమ్, కాస్త దాల్చిన చెక్క, తేనె, పాల మిశ్రమంతో ఆపిల్ మిల్క్ షేక్ ను ప్రిపేర్ చేస్తారు. ఇది పిల్లలకు తక్షణ శక్తిని ఇస్తుంది మరియు హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది.

మూంగ్ దాల్

మూంగ్ దాల్ కమ్మగా రుచికరంగా తినడానికి ఎంతో సులువుగా ఉండే మూంగ్ దాల్ ప్రస్తుతం చాలామంది పిల్లలకు ఫేవరేట్ స్నాక్స్. వీటిని బాగా వేయించి పిల్లలు ముందు ఉంచితే బాగా తింటారు. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం మోతాదులో ఇవ్వాలి. బయట షాపులలో దొరికేవి కాకుండా ఇంట్లోనే చేసుకోవడం మంచిది.

ఆమ్లెట్

ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకుని వాటిని పగలగొట్టి ఒక గ్లాస్ లోకి వేసుకోవాలి. చిటికెడు పసుపు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చి మిర్చి అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. తక్కువ నూనెతో ఆమ్లెట్ వేసి పిల్లలకు ఇవ్వాలి. దీనికి బదులుగా ఉడికించిన గుడ్డు కూడా ఇవ్వవచ్చు.

లడ్లు

రాగి లడ్డు, పీనట్ లడ్డు, వేరు శనగలతో చేసిన స్వీట్స్, ఓట్స్ లడ్డు, అరటిపండు అప్పం, పొంగణాలు,మురుకులు లేదా కారాలు ఇటువంటి వాటిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ స్నాక్స్ ఇవ్వడం వారికి ఆరోగ్యకరం.

ఇవే కాకుండా ఇంకా ఏమైనా మంచి స్నాక్స్ ఉంటే మీ కామెంట్స్ ద్వారా తెలుపవచ్చు. ఇది మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon