Link copied!
Sign in / Sign up
1
Shares

సవతి తల్లి 3 ఏళ్ళ కూతురికి చిత్రహింసలు : గోనెసంచిలో వేసి నరకం చూపించిన వీడియో వైరల్..

అమ్మ, తల్లి, జనని..ఇలా అమ్మను మాత్రమే ఎన్నో విధాలుగా ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం. ఎలా పిలిచినా అమ్మ అనే పదంలో ప్రేమ, మమకారం, ఆప్యాయత, అనురాగం, జాలి, కనికరం అనేవి ఉంటాయి. తల్లి లేని పిల్లలను కూడా తమ సొంత వారిలా చూసుకుంటున్న ఈ రోజుల్లో కూడా, ఓ సవతి తల్లి 3 సంవత్సరాలు ఈ చిన్నారిని చిత్రహింసలు పెట్టిన సంఘటన చూస్తే ఎందుకిలా చేస్తున్నారో అర్థం కాదు. అస్సలు వారికైనా తెలుస్తుందో లేదో కూడా తెలియడం లేదు. అసలేం జరిగిందో మీరే చూడండి.

3 ఏళ్ళ కూతురిని గోనె సంచిలో పడేసిన సవతి తల్లి

తనకు పుట్టిన కూతురు కాదు కదా అనే కారణమో ఏమో గానే 3 ఏళ్ళ ఈ చిన్నారిని ఒక గోనె సంచిలో పడేసి కనికరం లేకుండా పైకి కిందకు ఊపి కొట్టింది ఈ కనికరం లేని తల్లి. తనకు పుట్టకపోయినా, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను ఒక తల్లినే అని మరిచిపోయి అభం శుభం ఎరుగని ఆ చిన్నారికి ఊపిరి ఆడకుండా చేసి ఆనందించింది. ఇలా చేస్తూ తన పిల్లలతో వీడియో తీయమని చెప్పింది. స్కూల్ లో ఏం చేస్తున్నావ్, స్కూల్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ విధంగా చేసిందట. ఆ వీడియో ఇదే..

భర్త ముందే కూతురిని కొట్టింది

ఇలా కూతురిని గోనెసంచిలో పడేసి ఆనందించిన ఈ మహిళ పేరు జస్ప్రీత్ కౌర్. చండీగర్ లో గతనెలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి తన కొడుకు ఈ విషయం జస్ప్రీత్ కౌర్ భర్త మరియు ఆ చిన్నారి తండ్రి అయిన మన్మోహన్ కు చెప్పడంతో, ఏదో కోపంలో తెలియకుండా చేసిందని వదిలేశాడు. మళ్ళీ తనముందే ఇలా చేయడంతో ఆయనే వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. గత రెండు నెలలుగా అక్కడే ఉందట. ఒకేసారి చిన్నారి కాలికి గాయం అయినా సరే అలాగే హింసించింది. ప్రస్తుతం ఈ విషయం చండీగర్ బాలల హక్కు అధికారుల దగ్గరికి వెళ్ళింది.

ఇద్దరికీ ఇది రెండో పెళ్లి

జస్ప్రీత్ కౌర్ కు 7 ఏళ్ళ కూతురు ఉంది. కొన్నేళ్ల క్రితం తన భర్త చనిపోవడంతో 2 సంవత్సరాల క్రితం మన్మోహన్ ను పెళ్లి చేసుకుంది. ఇద్దరూ పిల్లల కోసం కలిసి నిర్ణయం తీసుకుని ఒక్కటయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పాప ఏ పని చేస్తున్నా తన కూతురు కాదు కదా అనే నెపంతో ఇలా హింసిస్తోందట. తనని అనవసరంగా వివాహం చేసుకున్నానని, నా కూతురిని ఇలా హింసిస్తుందని అనుకోలేదని మన్మోహన్ పశ్చాత్తాపపడుతున్నాడు.

అమ్మ అంటే అందరికీ గౌరవం, ఇష్టం, ప్రేమ. ఇలా చిన్నారులను హింసించి అమ్మ అనే మాటకు దయచేసి మచ్చను తీసుకురాకండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon