Link copied!
Sign in / Sign up
42
Shares

సంతోషంగా ఉండే భార్యాభర్తలు నిద్రపోయేముందు ఈ 5 పనులు తప్పక చేస్తారు..

మీకు తెలుసా, రాత్రి పడుకునే ముందు ఒక గంట ముందు భార్యాభర్తలు ఇక్కడ చెప్పుకునే ఈ పనులు తప్పకుండా చేయడం వలన ఒకరిపై ఒకరి ప్రేమ పెరుగుతుంది. జీవితంలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు అనేలా ఎప్పుడు ఒకరి గురించే ఆలోచిస్తూ ఉంటారు.  సంతోషంగా ఉండే కొంతమంది దంపతులు రాత్రి పడుకునేముందు తప్పకుండా చేసే ఆ 5 పనులు మీకోసం…

మీ పనులు పక్కన పెట్టండి

చాలావరకు మహిళలు ఉదయం నిద్రలేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆఖరికి భర్త బెడ్ రూమ్ లో ఉన్నాడు అని తెలిసినప్పుడు కూడా ఇంకా వంట గదిలో ఏదో పనిచేస్తూ ఉంటారు. ఎన్ని పనులున్నా సరే అవి పక్కనపెట్టి వెంటనే బెడ్ రూమ్ లోకి వెళ్లి మీ ఆయనతో ఈ రోజు అంతా ఏం చేశారో, లేక మీకు సంతోషాన్ని ఇచ్చే విషయాల గురించి మాట్లాడండి. మీ ఆయన ఎప్పుడైతే పడకగదిలో వెళ్తారో మీరు అప్పుడే వెళ్ళండి.

మనస్సు విప్పి మాట్లాడండి

మంచైనా చెడైనా, బాధైనా సంతోషమైనా సరే మనస్సువిప్పి మాట్లాడుకోవడం వలన ఇద్దరిమధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి. మీ దాంపత్యం మరింత బలంగా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కూడా. ఏదైనా మనస్సులో దాచుకుని ఇది మా ఆయన చెబుతాడులే, మా ఆవిడ మాట్లాడినప్పుడే నేను ఆ విషయం గురించి చెబుతాను అనుకోవడం ఇద్దరికీ మంచిది కాదు.

ఈ పని అస్సలు చేయకండి

చాలామంది దంపతులు తమ మధ్య ఏదైనా మాట వచ్చినప్పుడు గానీ చిన్న గొడవైనప్పుడు పడకగదిలో ఒకరికొకరికి దగ్గరగా కాకుండా ఎంతో దూరంగా ఉంటారు. చేతులు కూడా తాకరు. ఇలా చేయడం వలన దూరం అనేది ఇద్దరి మధ్య పెరుగుతుందే కానీ అస్సలు తగ్గదు. శరీర స్పర్శ మనం చేసిన తప్పులను దూరం చేస్తుంది, దూరం చేయడమే కాదు ఆ తప్పులు కూడా మళ్ళీ కనిపించవు.

పిల్లలను మీ బెడ్ రూమ్ లోకి తీసుకురాకండి

సంతోషంగా ఉండే దంపతులు ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు కూడా. మీ పిల్లలు నిద్రపోయేవరకు వారు మీతో ఉంటే ఫర్లేదు కానీ, మీరు ఏకాంతంగా మాట్లాడుకునే విషయాలు వారికి తెలియకూడదు. వారిని ఆ మాటలకు దూరంగా ఉంచాలి, అలాగే మీ మధ్య జరిగే ఏ పని కూడా వారికి తెలియడం అంత మించిది కాదు. మీ సమస్యలు, బాధలు వారికి తెలిస్తే వారు కూడా బాధపడే అవకాశం ఉంది కాబట్టి.

ఇది చాలా ముఖ్యమైనది

ఇదివరకే చెప్పుకున్నట్లు శరీర స్పర్శ కూడా తప్పులను దూరం చేస్తుంది. అలాగే దంపతుల మధ్య ఏకాంతంగా జరిగే పని కూడా ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. కొద్దిసేపు మీకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఏకాంతంగా ఉండటం మంచిది. దంపతుల మధ్య ప్రతిరోజూ  ఆ పని చేయడం అనేది తప్పు కూడా కాదు. అలాగే ముద్దులు ముఖం, మెడ, చేతులపై ప్రేమగా ముద్దులు పెట్టుకోవడం వలన ఒకరిపై ఒకరికి ప్రేమ ఇష్టం పెరుగుతుంది.

సంతోషంగా ఉండే దంపతులు చేస్తున్న పనులు ఇవే.. మీకు నచ్చితే మీరు పాటించండి, మీ దాంపత్యాన్ని సంతోషంగా ఉంచుకోండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon