Link copied!
Sign in / Sign up
0
Shares

రైతుల పండుగ ''సంక్రాంతి'' విశిష్టత : సంక్రాంతి రోజు దంపతులు చేయాల్సిన 5 పనులు

మీకు తెలుసా సంక్రాంతి పండుగనే సంక్రమణం అని కూడా అంటారు. సూర్యుడు రాశిలోకి ప్రవేశించేదాన్ని సంక్రమణం అని అంటారు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేహించే కాలమే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి. రైతులు కష్టపడి, చెమటోడ్చి పండించిన పంట ఇంటికి వచ్చే సమయంలో ఈ సంక్రాంతి పండగ వస్తుంది కాబట్టి ఈ పండుగను రైతుల పండుగగా చెప్పుకుంటారు. మరి సంక్రాంతి రోజున పూజలు ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది కానీ సంక్రాంతి రోజు దంపతులు చేయాల్సిన 5 పనుల గురించి తెలుసుకోండి..

స్వర్గపు వాకిళ్లు తెరుచుకునే రోజు

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే ఈ రోజు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజున స్వర్గపు వాకిళ్లు తెరుస్తారని పెద్దలు చెబుతున్నారు. ఈ పండుగ ఎప్పుడు ఒంటరిగా రాదు, తోడుగా భోగిని వెనుకల కనుమను, ఆ తర్వాత ముక్కనుమను వెంటబెట్టుకొస్తుందని సంక్రాంతి గురించి గొప్పగా చెబుతారు. ఐతే ఈ రోజున ఇక్కడ చెప్పుకునే పనులు చేయడం వలన వారికి పుణ్యఫలం లభిస్తుందని అంటున్నారు.

పేదలకు దానం

మన దగ్గర ఉన్నదానిలో సర్దుకుని బ్రతకడం ఎప్పుడు జరిగేదే. పండుగ రోజు కాబట్టి పండుగ జరుపుకోలేని ఇబ్బందిలో ఉన్న పేదలకు డబ్బు దానం, ధాన్యం, వస్త్ర దానం..ఇలా మీకు తోచినంతలో మనస్ఫూర్తిగా చేయడం వలన మీకు పుణ్యం ఉంటుందని పెద్దలు చెబుతారు. అలాగే ఇంటి వద్దకు వచ్చి మీకు అంతా శుభమే జరగాలని కోరుకునే గంగిరెద్దుల బసవన్నలను వెనక్కు పంపకూడదు.

తల్లితండ్రులను తలచుకుని (పితృరుణాలు)

జన్మను ఇచ్చిన తల్లితండ్రుల వద్ద పండుగ రోజున పితృరుణాలు, పిండదానాలు, చేయడం వలన మరణించిన పితృఋణం కొంచెమైనా తగ్గుతుందని మన పెద్దలు, పండితులు చెబుతున్నారు. పండుగ రోజు కాబట్టి మంచి భవిష్యత్ ఉండాలని అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే దైవాన్ని నమ్మేవారు భక్తితో పూజలు చేసి గుడికి వెళ్లి కొబ్బరికాయ కట్టమని చెబుతారు.

పశువుల అలంకరణ

సంక్రాంతి రోజు ప్రత్యేకత ఇదే. ఉదయం నిద్రలేచి, నువ్వులపిండి మర్దనా చేసుకుని, తలంటు స్నానం చేసుకుని, కొత్త బట్టలు ధరించి భక్తితో పూజలు చేయడమే కాదు. వ్యవసాయానికి ఉపయోగపడుతున్న ఎద్దులను, పాల రూపంలో పిల్లల పెద్దల ఆకలిని తీరుస్తున్న ఆవులు, గేదెలను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు వేయడం, పువ్వులను దండలా అమర్చి పశువుల మెడలో వేసి ఊరేగింపు చేసి సంతోషపెడతారు. మా జీవన విధానంలో మీరు కూడా ఒక భాగమే అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు.

ఈ పని చేయకండి

ఇది చెప్పకూడని విషయమే, ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుందని ఆశిస్తున్నాం. పండుగ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇంట్లో అందరూ సంతోషంగా, దైవభక్తితో జరుపుకుంటున్న పండుగను అపవిత్రం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది కాబట్టి, ఇలా చేయకూడదని చెప్పండి. అలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం, తిట్టుకోవడం చేయకూడదు.

మీకు నచ్చిన పని, శుభం కలుగుతుంది

ముచ్చటగా మూడు రోజులగా పండుగగా వస్తున్న సంక్రాంతి రోజున రైతులు పొలంలో కొబ్బరికాయ కొట్టి, కొద్దిసేపు పొలాన్ని దున్నటం వలన ఆ భూదేవిని పాడిపంటలు బాగా చూసుకోవాలని కోరటం కూడా. అలాగే ఈ రోజు మీకు నచ్చిన పని లేదా ఏదైనా కొత్త కార్యక్రమం మొదలు పెట్టడం వలన అంతా శుభమే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. సంక్రాంతి రోజు పూజ ఎలా చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది. కానీ ఈ విషయాలు చెప్పడం మా బాధ్యతగా భావిస్తున్నాం.

టైనీ స్టెప్ తరపున ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon