Link copied!
Sign in / Sign up
30
Shares

నార్మల్ డెలివరీ సమయంలో ఈ 9 విషయాలు జరుగుతాయని మీరు ఊహించలేరు

ఒక బిడ్డకి ప్రాణం పోయాలంటే తల్లి ఎన్ని కష్టాలు పడాలో మాటల్లో వివరించలేనిది. 9 నెలలు శిశువును జాగ్రతగా కడుపులో దాచుకోవాలి. తరువాత కాన్పు. ఒక రక౦గా చెప్పాలంటే కాన్పు అనేది ప్రతి మహిళకి పునర్జన్మ లాంటిది. కాన్పు రెండు రకాలుగా జరగవచ్చు. సహజ కాన్పు మరియు  c - సెక్షన్ కాన్పు. ప్రసవ సమయంలో మీ ప్రయత్నము అత్యంత అవసరం, మరీ ముఖ్యంగా సహజ ప్రసవంలో. సహజ కాన్పులో కొన్ని ఊహించని పరిస్తితులు ఎదురవచ్చు. అవేంటో తెలుసుకొని మానసికంగా వాటికి సిద్దంగా ఉంటె ప్రసవం మరింత సులువుగా అవుతుంది. ఇప్పుడు సహజ కాన్పులో మాత్రమే సంభవించే కొన్ని విషయాలు తెలుసుకుందాము.

1. అనుకున్న దానికంటే ఎక్కువ

ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే గర్భంలో బిడ్డతో పాటు గర్భస్త మావి కూడా ఏర్పడుతుంది. శిశువు గర్భంలోంచి బయట వచ్చిన తరువాత మీరు గర్భస్త మావిని  కూడా బయట పంపవల్సి వస్తుంది. అందుకోసమని కాన్పు తర్వాత కూడా డాక్టర్స్ మిమ్మల్ని పుష్ చేయమని చెప్పవచ్చు. ఇది సహజ కాన్పులో మాత్రమే జరిగే ప్రక్రియ. కాబట్టి ఈ విషయం గుర్తించుకొని సిద్దంగా ఉండండి.

2. గర్భాశయ మర్దన చేయవలసి రావచ్చ

కొన్ని మార్లు రక్తస్రావం ఆపడానికి గర్భాశయ మర్దన చేయ వలసి రావచ్చు. ఆ సమయములో మీకు చాలా నొప్పిగా మరియు ఇబ్బందికరముగా ఉండవచ్చును. కాని రక్తస్రావం ఆగడానికి మర్దన చేయడం అత్యంత అవసరము. ఇది మీకు కొత్తగా వింతగా అనిపించవచ్చును కాని ఇది నిజం.

౩. కుట్లు

ప్రసవ సమయములో మీరు బిడ్డను పుష్ చేయడం వలను మీ యోని చీలికకు లోనయ్యే అవకాసము లేకపోలేదు. అలా జరిగితే మీకు కుట్లు వేయాల్సి రావచ్చు. కొన్ని రోజులు వరకు కుట్లు వేసిన ప్రదేశం ఊది ఇబ్బందిగా అనిపిస్తుంది.

4. వ్యర్థ పదార్థములు బయట రావడం

సహజ ప్రసవం జరిగి శిశువు బయట వచ్చాక మీరు ఆనంద పడేలోపు గర్భాశయ మావి బయట పంపవలసి వస్తుంది. అక్కడితో ఆగకుండా మీ గర్భంలో 9 నెలలుగా పేరుకున్న పదార్థములును కూడా బయట పంపాల్సి వస్తుంది. ఇది మీకు శ్రేమతోనే కాదు సమయముతో కూడా కూడుకున్న పని.

5. ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం 
కుట్లు వలన కాని, ఒత్తిడి వలన కాని యోని భాగం పుండులా మారవచ్చు. దానిని సరైన స్తితిలోకి వచ్చే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవలెను. క్రమము తప్పకుండా శుభ్రం చేసుకుంటూ మందులు వాడవలెను.
6. ప్రసవం జరుగుతుండగా మూత్ర విసర్జన జరగవచ్చు

ప్రసవం జరుగుతుండగా మూత్ర విసర్జన జరగడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. మీరు బిడ్డను బయటికి పంపే క్రమంలో మీ శరీరం అధిక ఒత్తిడికి లోనవుతుంది. ఆ ఒత్తిడి కారణ౦గా మూత్ర విసర్జన జరగవచ్చు.

7. కాన్పు తరువాత మూత్ర విసర్జన 

కాన్పు తరువాత మూత్ర విసర్జన చేయడం చాలా నొప్పితో కూడుకున్న పని. అసలే సున్నితంగా తాయారు అయిన మీకు మూత్ర విసర్జన చేసే అప్పుడు భయంకరంగా నొప్పి కలగవచ్చు.

8. భర్తకి దూరంగా 

కాన్పు తరువాత కొన్ని రోజులు భర్తతో శారీరకంగా దూరంగా ఉండాలి. మీ భర్త మీద ఎంత ప్రేమ ఉన్న ఇది తప్పదు. డాక్టర్ల సలహా తీసుకుని అన్ని సర్దుకున్నాక మాత్రమే శృంగారంలో పాల్గొనాలి.

9. పునర్జన్మ

ప్రసవం తరువాత మీకు మీరే కోతగా కనపడుతారు. కొన్ని నెలల పాటు మీ శరీరంలో కొత్త కొత్త మార్పులు గమనిస్తుంటారు. కాని భయపడకండి, ఇది సహజమే.

10. కొన్ని రోజులు డైపర్స్ వేసుకొని పడుకోవాల్సి వస్తుంది

కొన్ని రోజులు మీకు రక్త స్రావం జరిగే అవకాశం ఉంది. అందువలన మీరు డైపర్స్ వేసుకొని పడుకోవాల్సి రావచ్చు. అసలే సున్నితంగా మారిన యోనిని మరింత ఇబ్బంది పరచవలసి వచ్చినప్పుడు చాలా కష్టముగా అనిపించవచ్చును.


కానీ, ఈ కష్టాలు అన్ని మీ బిడ్డను ఒక్కసారి చూడగానే మర్చిపోతారు.  తన చిరునవ్వు చూసి మురిసిపోతారు. కాబట్టి, సరైన అవగాహన పెపొందించుకొని అన్నింటికీ సిద్దముగా ఉండదండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon