Link copied!
Sign in / Sign up
0
Shares

సగం తలతోనే జన్మించిన బాబు..! డాకర్ట్లు బ్రతకడని చెప్పారు, కానీ 3 ఏళ్ళ తర్వాత ఎలా ఉన్నాడో చూడండి

ఈ చిత్రంలో ఉన్న చిన్నారి పేరు జాక్సన్ బ్యూల్. మూడేళ్ళ క్రితం ఈ ప్రపంచంలోకి సాధారణ ప్రసవం ద్వారా అడుగుపెట్టాడు. ఐతే ఈ బాబును చూసిన వెంటనే రెండు లేదా మూడు రోజుల కంటే బ్రతకడం కష్టమని చెప్పారు. కానీ ఇప్పుడు మూడేళ్లు. చాలా సరదాగా ఉంటున్నాడు. అమ్మ నాన్నలతో ఆడుకుంటున్నాడు. ప్రపంచం మొత్తాన్ని కదిలించిన జాక్సన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

ప్రేమకు చిహ్నంగా పుట్టిన బాబు

జాక్సన్ తల్లితండ్రులు బ్రాండన్ మరియు బ్రిటానీ. ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకు బ్రిటానీ గర్భం దాల్చారు. తమ సంతోషం రెట్టింపు అయ్యింది. ఐతే కొన్ని వారాల ప్రగ్నన్సీ చెకప్ కు వెళ్లగా బిడ్డ పెరుగుదలలో కొన్ని ఇబ్బందులను గమనించారు డాక్టర్స్. అబార్షన్ చేయించుకుంటే మంచిదా అనే ఆలోచనలో పడ్డారు ఈ దంపతులు, కానీ తమ ప్రేమకు చిహ్నమైన శిశువును కావాలనుకున్నారు.

80 % తల లేకుండా పుట్టిన బాబు

ఇక్కడ ఫొటోలో చూపించినట్లుగా కేవలం ముందు భాగం మాత్రమే గర్భంలో అభివృద్ధి జరిగి, పెరుగుదల ఆగిపోయింది. వెనుక బ్రెయిన్ భాగంలో పెరుగుదల లేదు. మెడ కిందకు అతుక్కుపోయింది. ఐతే ఇలా పుట్టడం వెనుక డాకర్ట్స్ కూడా సరైన కారణం చెప్పక పోయినా ఇటువంటి కేసులు చాలానే చూసిన అనుభవంతోనే బ్రతకడం కష్టమేనని ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేమని అన్నారు. డాక్టర్ల మాట విన్నాక చాలా భయపడ్డారు జాక్సన్ తల్లితండ్రులు. కానీ ఎక్కడో చిన్న ఆశ. తమ బిడ్డను ఆరోగ్యంగా సంతోషంగా చూసుకోగలమని.

మూడవ పుట్టిన రోజు..ఐ లవ్యూ అమ్మ

రీసెంట్ గా జాక్సన్ మూడవ పుట్టినరోజును చాలా సంతోషంగా జరుపుకున్నారు. మూడు రోజులు కూడా బ్రతకడం కష్టమే అని చెప్పినవారు, జాక్సన్ తను బ్రతకాలి అనుకున్న సంకల్పం ముందు విధి కూడా తల దించుకుంది. అమ్మతో ఆడుకుంటున్నాడు, నాన్నతో కలిసి బయటకు వెళ్తున్నాడు. మాట్లాడానికి ఇబ్బంది పడ్డవాడు ఐ లవ్యూ అమ్మ అనడానికి ప్రయత్నిస్తున్నాడు. చేతిలో ఉన్న వస్తువులు, ఆట బొమ్మలు పక్కకు విసిరివేయగలుగుతున్నాడు. అమ్మను ఐ లవ్యూ అని పిలవడానికి ప్రయత్నిస్తున్న ఈ వీడియో మీరు చూడండి.

అమ్మతో జాక్సన్ బ్ల్యూ

 

నాన్నతో జాక్సన్ బ్ల్యూ

 

మూడు సంవత్సరాల జాక్సన్

 

అమ్మతో ఆడుకుంటూ

సంకల్పం ముందు విధి కూడా తల వంచాల్సిందే అని నిరూపించిన జాక్సన్ బ్ల్యూ గురించి అందరికీ SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon