Link copied!
Sign in / Sign up
6
Shares

స్నానానికి ఈ సబ్బులు వాడకండి : బరువు పెరిగి లావు అవుతారు..

స్నానానికి ఉపయోగించే సబ్బులను వాడితే లావు అవుతారా..! నిజంగా ఇది వింటుంటే షాకింగ్ గా అనిపిస్తుంది కదూ.  కానీ ఇది అందరూ నమ్మాల్సిన నిజం కూడా. నురగ బాగా వస్తుందని, సువాసన వెదజల్లు తున్నాయని, అందంగా మారుస్తున్నాయని సోప్స్ వాడటం చేస్తున్నాం. ఈ సోప్స్ మన శరీరానికి ఊబకాయాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు తాజాగా దీనిపై పరిశోధనలు చేసిన నిపుణులు. అదేంటో వివరంగా చూద్దాం..

సోప్స్ వాడితే లావు అవుతారా..!

సోప్స్ వాడితే లావవుతారా అంటే నిజమే అని చెబుతున్నారు. ఎలాగంటే ఈ సోప్స్ లలో థలేట్స్ అనే కెమికల్స్ కలపడం వలన ఇవి శరీరానికి హాని కలిగిస్తాయట. ఈ థలేట్స్ వలనే శరీరం బరువు పెరగడం, ఊబకాయం రావడం కూడా ఒక కారణమని చెబుతున్నారు నిపుణులు. ఈ కెమికల్స్ ను  ఇంకా చేతి గోర్లకు వేసుకునే నెయిల్ పాలిష్ లలో కూడా ఉపయోగిస్తున్నారట. ఇది మనిషి కొవ్వుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ఎందుకు ఈ కెమికల్స్ మిక్స్ చేస్తారు..?

థలేట్స్ అనే ఈ రసాయనం మిక్స్ చేయడం వలన సబ్బులలో నురగ మరియు సువాసన ఎక్కువగా రావటం, అదే నెయిల్ పాలిష్ లలో అయితే గోర్లకు పాలిష్ వేసుకోగానే నెయిల్స్ ప్రకాశవంతంగా మెరుస్తాయి. దీనిని ఎలుకలపై ప్రయోగం చేయగా నిరూపితమైందని సమాచారం.

మరి ఎలాంటి సోప్స్ వాడాలి..?

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సోప్స్ వాడుతున్నారు, కాబట్టి ఏ సోప్ వాడాలి అనే అనుమానం ఈ పాటికే వచ్చి ఉంటుంది. అందుకని ప్రస్తుతం కొన్ని సోప్స్ మార్కెట్ లో సహజంగా చేసినవి వస్తున్నాయి కాబట్టి వాటిని వాడటం మంచిది. అందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు అని సోప్ కవర్ పై తెలిపి ఉంటారు.  ఇంకా మీకు ఇష్టమైతే శనగపిండి, నలుగుపిండి, ముల్తాన్ మట్టిలతో కూడా స్నానం చేసుకోవచ్చు. ఇవి మీ శరీరానికి ఇంకా మంచివి కూడా..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon