Link copied!
Sign in / Sign up
11
Shares

ఋతు క్రమం (Periods) సక్రమంగా జరగడానికి 4 శక్తివంతమైన మార్గాలు


ఆడజన్మ ఎంత గొప్పదో అంతే పవితమైనది, కష్టమైనది. కష్టమైనది ఎందుకంటే మనం చేయని తప్పులకు ప్రతి నెల మూడు రోజులు శిక్షను అనుభవిస్తుంటాము. ఈ పెరిఒద్స్ అనేవి చాల నొప్పిని కలిగిస్తాయి కానీ మీ రోజుని పాడు చేయకుండా ఉండాలంటే ఈ అద్భుతమైన పద్దతులను ప్రయత్నించండి.

రెండు రకాల పద్దతులతో ఋతు క్రమం సమస్యలు నివారించుకోవచ్చు. మొదటిది సహజమైన పద్దతి, రెండవది మెడికల్ పద్దతి. ఎప్పుడు ఈ రెండు పద్దతుల గురించి వివరంగా తెలుసుకుందాము.

సహజమైన పద్దతి

1. ఆహార విషయాలలో జాగ్రత్త వహించడం

విటమిన్ E, B1, B6, మెగ్నీషియం, జింక్ మేరీ ఒమేగా ఫాటీ ఆసిడ్స్ వంటి పోషకాలు నొప్పిని కలిగించే హార్మోన్స్ ని తగ్గించి పొట్ట కండరాళ్ళకు నొప్పి కలిగించకుండా చేస్తాయి. అందువలన ఈ పోషక విలువలు ఎక్కువ ఉన్న ఆహరం తీసుకుంటే ఋతు క్రమం వలన కలిగే నొప్పులను దాదాపుగా నివారించవచ్చు. అంతే కాకుండా కాఫీ వంటి వాటిలో ఉండే కెఫిన్ అనే పదార్థం ఋతు క్రమంని మరింత ఇబ్బందిగా మారుస్తాయి. అందువలన ఆ సమయాల్లో వీలైనంత వరకు కాఫీకి దూరంగా ఉండండి.

మాంసాహారంలో ఉండే చెడు కొవ్వు తినడం అంత మంచిది కాదు. కావున మంచి కొవ్వు దొరికే ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవడం మంచిది.

కొన్ని రకాల టీ తాగడం వలన కూడా పీరియడ్స్ సమస్యలను తగ్గిస్తాయి. మీకు ఎలాంటివి సరిపోతాయో డాక్టర్ దగ్గర సలహా తీసుకొని అవి వాడితే మంచి ఫలితం ఉంటుంది.

2. వేడిని వేడితోనే తగ్గించండి

ఋతు క్రమం నొప్పులు తగ్గాలంటే ఆ ప్రదేశం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం మాత్రలు వేసుకున్న దానికంటే బాగా పని చేస్తుంది.

మెడికల్ పద్దతి

1. అక్క్యూపంక్చర్

మీరు నొప్పి భరించలేకుండా ఉంటె వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్క్యూపంక్చర్ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఒక్కొక సారి ఇలా చేయడం అవసరం రావచ్చు ఎందుకంటే శరీరం తీవ్ర వత్తిడికి గురైయుంటుంది, దానికి తోడు నొప్పులు వస్తే భరించలేకపోతాం. అలాంటి సమయంలోనే అక్క్యూపంక్చర్ ఆవాసం వస్తుంది.

మంచి ఫిజీషియన్ దగ్గరకి మెల్లది. పొట్ట భాగంలో, వీపు, పాదాలు మర్దనా చేసుకుంటే కూడా ఈ నొప్పులు తగ్గుతాయి.

2. మాత్రలు వాడండి

మీరు నొప్పి భరించలేకపోతే వెంటనే ఒక మాత్ర వేసుకోండి. ఆగండి, మెడికల్ షాపులో కొనుక్కొని ఏ మాత్ర పడితే అది వేసుకోకండి, డాక్టర్ని సంప్రదించి మీకు సరిపోయే మాత్ర వేసుకోండి.

ఋతు క్రమం ముఖ్యంగా ప్రోస్టాగ్లాండిన్స్ విడుదల కారణంగా జరుగుతాయి. NSAIDs వాడటం వలన వాటి ఉత్పన్నం తగ్గి నూపి కూడా తగ్గుతుంది.

మీకు తెలుసా?

ఋతు క్రమం ద్వారా నొప్పులు కష్టాలు మాత్రమే కాదు, మంచి కూడా జరుగుతుందన్న విషయం మీకు తెలుసా? నిజమండి, ఋతుక్రమము జరగడం ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేనా, ఈ క్రమమే మిమ్మల్ని పిల్లలు కనడానికి సిద్ధంగా చేస్తుంది. నొప్పితో పోల్చుకుంటే ఈ మంచి తక్కువే అనుకోండి, కానీ తప్పదు. పైన చెప్పినవి విధిగా పాటించి నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon