Link copied!
Sign in / Sign up
15
Shares

ఋతు చక్రం అంటే ఏంటి? అందులో ఎన్ని దశలు ఉంటాయి? : ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు!!

సాధారణంగా మహిళలందరికి పీరియడ్స్ మీద ఒక అవగాహన ఉంటుంది. కానీ ఋతు చక్రం గురించి అంతగా అవగాహన కలిగి ఉండరు.  కానీ ఋతు చక్రం మీ శరీర మరియు మానసిక ఆరోగ్యాలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా మీ శృంగార జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రతి మహిళ తమ శరీర ఋతు చక్రం పై ఒక అవగాహన కలిగివుండాలి.

అందుకే మీకోసం,  ఋతు చక్రం గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం…

ఋతు చక్రం - Menustrual Cycle

మీరు రజస్వల అయిన తరువాత శరీరంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయి. రజస్వల అయ్యే వయసు వ్యక్తులను బట్టి వేరుగా ఉండచ్చు. కొంత మంది 10 సంవత్సరాలకే రజస్వల అయితే, మరికొంతమంది 16 సంవత్సరాలకు అవుతారు. రెండు సహజమే. రజస్వల సమయంలో కొత్త హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మీ శరీరానికి ప్రతి నెల గర్భం దాల్చడానికి సిద్ధమవ్వమని సంకేతాలను అందిస్తాయి. ఈ హార్మోన్ స్థాయులు మీ ఋతు చక్ర దశను బట్టి ఎక్కువ, తక్కువ అవుతుంటాయి. ఈ హార్మోన్స్ మీ శరీర శక్తి, మానసిక స్థితి పై ప్రభావం చూపిస్తాయి.

ఋతు చక్రం 23 రోజుల ఉంది 35 రోజుల వరకు ఉండచ్చు. మీ శరీర స్వభావాన్ని బట్టి ఋతు చక్రం యొక్క పొడవు ఉంటుంది.

ఋతు చక్ర సమయంలో ఏమి జరుగుతుంది?
1 వ దశ : ఋతు దశ

మీ పీరియడ్స్ మొదలైన మొదటి రోజున, ఋతు చక్రం మొదలవుతుంది. మొదటి రోజున మీ గర్భాశయ లైనింగ్ ఊడి పోతుంది. ధీని కారణంగా మీ పొత్తి కడుపు ప్రాంతంలో తిమ్మిర్లు ఏర్పడుతాయి. వీటినే మేనుస్ట్రువల్ క్రామ్ప్స్ అంటారు.

2 వ దశ : అండ విడుదలకు సిద్ధమవడం

మీ పీరియడ్స్ చివరి రోజున, ఋతు చక్రంలోని రెండవ దశ మొదలవుతుంది. ఈ దశలో ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ (Folicle stimulating Harmone - FHS) మీ అండాశయాన్ని ఉద్దీపన పరుస్తుంది. అండం విడుదలవడానికి సిద్దపరుస్తుంది. ఈ దశలో మీ ఈస్ట్రోజెన్ స్థాయులు పెరుగుతాయి. అవి మీ గర్భసయంలో అండానికి కావాల్సిన లైనింగ్ ఏర్పరుస్తాయి.

3 వ దశ : అండ విడుదల

ఈ దశలో అందం విడుదలవుతుంది. విడుదలైన అండం ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయంలోకి చేరుకుంటుంది. అండం 12-24 గంటల వరకు జీవించి ఉంటుంది. ఆ సమయంలో అండంలోకి వీర్యం చేరుకుంటే మీరు ప్రేగ్నన్ట్ అవుతారు.

4 వ దశ : చివరి దశ

విడుదలైన అండం ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయానికి చేరుకునే సమయంలో, ప్రొజెస్టరీన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఒక వేళ మీ అండం వీర్యం తో కలవక పోతే, గర్భశయ లైనింగ్స్ ఊడిపోయి, రక్తం రూపంలో మీ శరీరం నుండి బయటకు వెళ్తుంది. ఋతు చక్రంలోని చివరి దశ ముగిసి,  మొదటి దశ మొదలవుతుంది.

ఋతు చక్రం గురించి ఇంకా వివరంగా అర్థమవడానికి ఈ వీడియో చూడండి… 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon