Link copied!
Sign in / Sign up
18
Shares

మహిళలలో అత్యంత ప్రమాదకరమైన రొమ్ము గడ్డలు : కారణాలు, లక్షణాలు, చికిత్స

రొమ్ము భాగంలో వాపు సమస్యతో చాలామంది మహిళలు బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.  బ్రెస్ట్ ఇన్ఫెక్షన్స్ వలనే ఈ విధంగా జరగడానికి కారణం. పాలిచ్చే తల్లులలోనే కాకుండా సాధారణ మహిళలు ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. రొమ్ము వాపుకు కారణాలు ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? తీసుకోవాల్సిన చికిత్స గురించి తెలుసుకుందాం..

స్తనాల వాపు

స్తనాలు ఉబ్బనట్లుగా ఉండి నొప్పి కలగడం, ఎర్రగా కందిపోవడం, వాసన వస్తూ ఉండటం ఈ విధంగా మహిళలలో జరగడానికి కారణం బ్రెస్ట్ ఇన్ఫెక్షన్స్. ప్రతి పది మంది మహిళలలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా మూడు నెలలవరకు బిడ్డకు పాలిచ్చే తల్లులకు ఈ విధంగా జరుగుతోంది.

స్తనాల భాగం ఎర్రగా కందిపోవడం, వాసన, నొప్పి, నీరసం, ఫ్లూ, చలితో కూడుకున్న జ్వరం, రొమ్ములను బిడ్డ తాకినప్పుడు తీవ్రమైన నొప్పి కలగడం, పాలు ఇవ్వని తల్లులలోనూ రొమ్ము స్తన భాగం నొప్పి కలగడం జరుగుతుంటుంది.

స్తనాల వాపుతో బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?

చాలామంది మహిళలకు ఉన్న అనుమానం స్తనాల వాపుతో ఇబ్బంది పడుతున్నప్పుడు బిడ్డకు పాలు ఇవ్వవచ్చా? ఇవ్వకూడదా? అని. తప్పకుండా ఇవ్వవచ్చు. ఈ సమయంలో పాలవృద్ధి జరుగుతుంది అలాగే బిడ్డకు పాలు ఇవ్వడం వలన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకవు.

స్తనాల వాపు లక్షణాలు

ఈ సమస్యకు ముఖ్య కారణం బ్రెస్ట్ ఇన్ఫెక్షన్స్. అలాగే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..

-స్తనాలు ఎర్రగా మారటం

-వాసన వస్తుండటం

-గట్టిగా, బరువుగా అవ్వటం

-పుండ్లుగా మారటం

-కొన్నిసార్లు రొమ్ముల నుండి పాలు బయటకు రావేమో అనేలా ఇబ్బంది కలగడంతో పాటు ఈ లక్షణాలు కూడా ఉంటాయి.

-జ్వరం

-అలసట

-బాడీ పెయిన్స్, హెడ్ పెయిన్

-చలిగా ఉండటం

స్తనాల వాపుకు కారణాలు

రొమ్ము భాగంలో పాలు ఎక్కువగా నిర్మితం ఉండటం వలన ఈ విధంగా జరగడానికి ఒక కారణం ఐతే, బిడ్డకు పాలు త్వరగా ఇవ్వడం వలన రొమ్ము నాళాలలోనే పాలు ఉండిపోవడం జరుగుతుంది. అలాగే ఒకవైపే పాలు తీసుకున్నప్పుడు లేదా పాలు తీసుకోకపోవడం వలన స్తనాల వాపుకు కారణం కాదు గమనించాలి. అయితే ఎప్పుడూ ఒకేవైపు పాలు సేవించడం వలన రొమ్ము ముందు భాగంలో వాపులుగా, పుండ్లుగా ఏర్పడటం జరుగుతుంది. అందుకనే బిడ్డకు రెండు వైపులా పాలు సేవించేలా చూసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు.

ఈ కారణాలు కూడా స్తన భాగం వాపుకు కారణాలు

-ఎక్కువసార్లు పాలు తీసుకుంటూ ఉండటం

-పాలు ఇచ్చే సమయం మధ్య ఎక్కువగా ఉండటం

-బిగుతైన దుస్తులు లేదా బిగుతుగా ఉన్న బ్రా ధరించడం వలన

-రొమ్ములపై పడుకుని బిడ్డ నిద్రించినప్పుడు

-రొమ్ముల వద్ద గాయం

-రొమ్ముల ముందు భాగం (నిపుల్స్) ఇన్ఫెక్షన్స్ కు గురైనప్పుడు

తీసుకోవాల్సిన చికిత్స

యాంటీబయోటిక్ మందులు : ఈ సమస్య ఉన్నప్పుడు 10-14 రోజులకు సరిపడేలా యాంటీబయోటిక్ మందులను వైద్యుడు ఇస్తాడు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అయితే వైద్యుడు చెప్పిన ప్రకారం యాంటీబయోటిక్ తీసుకోవడం వలన బిడ్డకు పాలిచ్చే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.

నొప్పిని తగ్గించే మందులు : బిడ్డకు పాలిచ్చే తల్లులు ఈ సమస్య నుండి బయటపడటానికి ముందుగా వైద్యులు చెప్పిన విధంగా మందులు  తీసుకోవడం చేయాలి. సాధారణంగా ఎసిటమైనోఫేన్ లేదా ఇబుప్రోఫెన్ నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి.

ఎప్పుడు డాక్టర్ను కలవాలి ?

రొమ్ము భాగం వాపుగా, గడ్డలు ఉండటం అనేది సాధారణ సమస్యే కదా! అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చేయాలి. లేకపోతే కొన్నిసార్లు ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో జ్వరం లేదా గడ్డలు కట్టి ద్రవం వచ్చేలా ఉంటుంది కాబట్టి తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం చేయాలి.

ఇంటి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాలు ఇస్తూనే ఉండాలి

అరె రొమ్ము భాగం వాపుగా ఉంది, ఎర్రగా కందిపోయింది కదా ఇటువంటి సమయంలో బిడ్డకు పాలు ఇవ్వడం కరెక్టేనా అనే అనుమానం అస్సలు పెట్టుకోకండి. పాలు ఇస్తూనే ఉండటం వలన తల్లికి, బిడ్డకు మంచిదే. లేకపోతే రొమ్ము భాగం మరింత గట్టిపడే అవకాశం ఉంది.

వెచ్చగా మసాజ్ చేయడం

గోరు వెచ్చని నీటిలో ఒక క్లాత్ ను ఉంచి రొమ్ము భాగంలో తడుపుతూ ఉండటం వలన రొమ్ము నొప్పి తగ్గి, ఇన్ఫెక్షన్స్ నుండి బయటపడవచ్చు. అలాగే ఐస్ ముక్కలను తీసుకుని ఆ భాగంలో ఉంచడం వలన నొప్పి తగ్గి రిలీఫ్ గా ఉంటుంది.

రోజుకి ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి?

బిడ్డకు ఇటువంటి సమయంలో కూడా రోజుకి 12 సార్లు పాలు ఇవ్వడం చేస్తే మంచిది. అలాగే 8 సార్లు కంటే తక్కువ కాకుండా చూసుకోవాలి.

ఒకవేళ బిడ్డ ఎక్కువగా పాలు సేవించకపోతే ఆ పాలను అలానే ఉంచకుండా బయటకు తీయడం చేయాలి.

దుస్తులు

వీలైనంత వరకు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. అలాగే బ్రా వంటి దుస్తులు కూడా మరీ బిగుతుగా ఉండటం వలన చాలా ఇబ్బంది కలుగుతుంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు  అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మీకు తెలివైన బిడ్డ పుట్టాలంటే ఈ ఆహారం తప్పకుండా తినండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon